తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఎన్టీఆర్ ప్రకటన

లోకేష్ పాదయాత్ర మొదటి రోజున తీవ్రమైన గుండెపోటుతో కుప్పకూలిన తారకరత్నకు ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగవ్వలేదు కానీ, ఆయన శరీరం చికిత్సకు స్పందిస్తోంది. Advertisement తారకరత్న…

లోకేష్ పాదయాత్ర మొదటి రోజున తీవ్రమైన గుండెపోటుతో కుప్పకూలిన తారకరత్నకు ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగవ్వలేదు కానీ, ఆయన శరీరం చికిత్సకు స్పందిస్తోంది.

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నిన్న హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన వైద్యులు, ఈరోజు ఇప్పటివరకు ఎలాంటి బులెటిన్ రిలీజ్ చేయలేదు. దీనికి బదులుగా స్వయంగా కర్నాటక ఆరోగ్య మంత్రి, తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన చేశారు.

ఐసీయూలో చికిత్స పొందుతున్న తారకరత్నను చూసేందుకు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లారు. తారకరత్నను చూసి, వైద్యుల్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. వీళ్లతో కన్నడ నటుడు శివరాజ్ కుమార్, ఆరోగ్యమంత్రి కూడా ఉన్నారు.

“తారకరత్నకు మెరుగైన వైద్యం అందుతోంది. ఆయన ట్రీట్ మెంట్ కు స్పందిస్తున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది కానీ క్రిటికల్ కండిషన్ నుంచి మాత్రం ఇంకా బయటకురాలేదు. కార్డియాక్ కు సంబంధించిన పరిస్థితులు నిలకడగా ఉన్నాయి. బ్రెయిన్ కు సంబంధించిన ఇష్యూస్ పరిశీలిస్తున్నారు.”

ఇలా తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, ఆరోగ్య మంత్రి సంయుక్త ప్రకటన విడుదల చేశారు. తారకరత్న ఎక్మోపై లేరనే విషయాన్ని నిర్థారించిన వైద్యులు, ఆయన గుండె స్పందిస్తోందని, బ్రెయిన్ ఇష్యూస్ మాత్రం ఉన్నాయని అంటున్నారు. మరో 12 గంటలు గడిస్తే తప్ప పరిస్థితిపై ఓ అంచనాకు రాలేమంటున్నారు.