Advertisement

Advertisement


Home > Politics - National

కుక్కల్ని వాకింగ్ కి తీసుకెళ్తే కోటి రూపాయలు

కుక్కల్ని వాకింగ్ కి తీసుకెళ్తే కోటి రూపాయలు

వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. ఇలా కుక్కలను వాకింగ్ తీసుకెళ్లడానికే  ఓ వ్యక్తి ఏకంగా టీచర్ జాబ్ వదిలేసుకున్నాడు. పార్ట్ టైమ్ గా కుక్కల్ని వాకింగ్ కి తీసుకెళ్లే మైఖేల్ జోసెఫ్ అనే ఆ వ్యక్తి చివరకు అందులోనే ఆదాయం బాగుండడంతో దాన్నే పర్మినెంట్ జాబ్ గా చేసుకున్నాడు. టీచర్ ఉద్యోగం వదిలేశాడు. ఇప్పుడు ఏకంగా కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు.

మంచి జీతం కావాలంటే ఐటీ ఉద్యోగమే బెస్ట్ అని మనం అనుకుంటాం, ఆదాయం బాగుండాలంటే డాక్టరో లేదా యాక్టరో అయితే బెటరని అనుకుంటాం. కానీ కుక్కల్ని వాకింగ్ కి తీసుకెళ్లే జాబ్ కూడా లాభసాటే అంటున్నాడు మైఖేల్ జోసెఫ్. న్యూయార్క్ లోని బ్రూక్లైన్ కి చెందిన జోసెఫ్.. టీచర్ గా పనిచేస్తూ 30లక్షలు జీతం తీసుకునేవాడు. అది సరిపోక టైమ్ పాస్ కోసం సాయంత్రం వేళ కుక్కల్ని వాకింగ్ కి తీసుకెళ్లేవాడు.

అతను వాటిని చూసుకునే విధానం నచ్చి కొంతమంది యజమానులు ఆయనకు పేమెంట్ పెంచి ఇచ్చేవారు, ఇంకొందరు తమ కుక్కల్ని పర్మినెంట్ గా చూసుకోడానికి తమతోపాటే ఉండిపోవాలని కూడా అడిగారు. కానీ జోసెఫ్ అలా చేయలేదు. ఇదేదో బాగుంది కదా అనే ఆలోచనతో టీచర్ ఉద్యోగానికి కూడా రాజీనామా చేశాడు. కేవలం కుక్కల్ని వాకింగ్ కి తీసుకెళ్లే జాబ్ మాత్రమే చేస్తున్నాడు. కోటి రూపాయల ఆదాయం సంపాదిస్తున్నాడు.

కుక్కల్ని 20 నుంచి 30 నిముషాల సేపు వాకింగ్ కి తీసుకెళ్తూ మంచి ఆదాయం సంపాదిస్తున్నాడు జోసెఫ్. ఈ జాబ్ తో న్యూజెర్సీలోని మిడిల్టన్ లో ఓ ఇల్లు కొనుక్కున్నాడు. కొత్త కారు కొన్నాడు, తన పాప భవిష్యత్ కోసం కొంత సొమ్ము కుడా బ్యాంక్ లో డిపాజిట్ చేశాడు.

అక్కడితో ఆగలేదు, కుక్కల కోసం పార్క్ సైడ్ పప్స్ అనే బిజినెస్ స్టార్ట్ చేశాడు. కుక్కల్నే తన ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నాడు. ఇదేదో బాగుంది కదా.. ఇండియాలో కూడా ఇలాంటివి వర్కవుట్ అవుతాయేమో.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?