Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఎన్టీఆర్ తొలి పాన్ ఇండియా కల

ఎన్టీఆర్ తొలి పాన్ ఇండియా కల

ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమా మొదలైంది. ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్టీఆర్ సోలో కాదు. సాదా సీదా దర్శకుడూ కాదు. బాహుబలి రెండు భాగాలతో ప్రపంచానికే పరిచయం అయిన దర్శకుడు రాజ‌మౌళి సినిమా. అందువల్ల దాన్ని లెక్కలో వేసుకోవడానికి లేదు. 

ఇప్పుడు అసలు సిసలైన పాన్ ఇండియా సినిమా కల ఇది. కొరటాల శివ మంచి దర్శకుడే. సందేహం లేదు. కానీ పాన్ ఇండియా లెవెల్ లో పరిచయం వున్న దర్శకుడు కాదు. అతని కాంబినేషన్ లో తనకు పాన్ ఇండియా గుర్తింపు వచ్చిన తరువాత ఎన్టీఆర్ చేస్తున్న తొలి ప్రయత్నం ఇది.

దాదాపు గత కొన్నేళ్లుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కలలు కంటున్నారు ..ఈ సినిమా కోసం అని కాదు. అసలు ఎన్టీఆర్ నుంచి సినిమా కోసం. ఆర్ఆర్ఆర్ మీద అంత దారుణంగా లాక్ అయిపోయారు ఎన్టీఆర్. కొరటాల శివ కూడా ఆచార్య తరువాత దాదాపు ఏడాదిగా ఖాళీగా వుండాల్సి వచ్చింది. ఇద్దరికీ ఇది ఓ కల. ఓ డ్రీమ్ ప్రాజెక్ట్. పోయిన తన పరువును నిలబెట్టుకోవాల్సి వుంది కొరటాల. ఆర్ఆర్ఆర్ తో వచ్చిన తన పాన్ ఇండియా ఇమేజ్ ను మరింత ముందుకు తీసుకెళ్లాల్సి వుంది.

ఇవన్నీ ఈ ఒక్క సినిమా మీద ఆధారపడి వున్నాయి. ఇది క్లిక్ అయితే ఎన్టీఆర్ కు పాన్ ఇండియా ఎంట్రీ ఇక కేక్ వాక్ అవుతుంది. దీని తరువాత ఎలాగూ ప్రశాంత్ నీల్ లాంటి దర్శకుడితొ సినిమా వుంది. దానికి ఎలాంటి సమస్య కాకూడదు అంటే కూడా ఇది సరైన సినిమా కావాలి. 

కొరటాల చెబుతున్నది చూస్తుంటే ఫుల్ మాఫియా బ్యాక్ డ్రాప్ సినిమా అని అర్థం అవుతోంది. అంతా జంతువుల్లాంటి మనుషులు..వాళ్లు భయపడేది ఒక్కరికే అంటేనే అర్థం అవుతోంది. ఎనీ హౌ బెస్ట్ ఆఫ్ లక్ ఎన్టీఆర్ అండ్ కొరటాల.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?