ఎన్టీఆర్ టోపీ తీయడం కష్టమే?

ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ పోషిస్తున్న కొమరం భీమ్ పాత్రకు ఓ మత విశ్వాసాలు ప్రతిబింబించే టోపీని పెట్టడంపై వివాదం కొనసాగుతోంది. ముందుగా ఆదివాసీ సంఘల నుంచి ప్రతిఘటన ప్రారంభమై భాజపా ఎంపీ వరకు వచ్చింది…

ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ పోషిస్తున్న కొమరం భీమ్ పాత్రకు ఓ మత విశ్వాసాలు ప్రతిబింబించే టోపీని పెట్టడంపై వివాదం కొనసాగుతోంది. ముందుగా ఆదివాసీ సంఘల నుంచి ప్రతిఘటన ప్రారంభమై భాజపా ఎంపీ వరకు వచ్చింది వ్యవహారం.

ఈ టోపీతో సినిమా తీస్తే అంగీకరించే సమస్యే లేదని అన్ని వైపుల నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. అయితే రాజమౌళి లాంటి దర్శకుడు ఇలాంటివి లెక్క చేయడు. ఆయన ఇప్పటి వరకు దీనిమీద పెదవి విప్పలేదు.

అయితే విశ్వసనీయ వర్గాల ప్రకారం సినిమాలో ఓ భాగం అంతా ఎన్టీఆర్ ఇదే టోపీతో కనిపిస్తాడని తెలుస్తోంది. అందువల్లే ఇప్పుడు ఈ టోపీ వ్యవహారం మార్చడం కష్టమే అని తెలుస్తోంది. సినిమాలో ఎన్టీఆర్ ఆజ్ఞాతవాసం మొత్తం ఈ టోపీతోనే వుంటాడని బోగట్టా.

ఎన్టీఆర్ ను తాము ముస్లింగా చూపించడం లేదని, అందువల్ల ఈ సమస్య గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన పని లేదని, సినిమా చూసిన తరువాత ఈ ఆందొళన చేస్తున్నవారంతా అర్థం చేసుకుంటారని రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

సినిమా టీజర్ వదిలే విషయంలో రాజమౌళి కావాలనే ప్రేక్షకుల్లో ఈ విషయంపై ఆసక్తి రేకెత్తించేందుకు (కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే టైపులో) ఎన్టీఆర్ గెటప్ ను వాడుకోవాలని చూసారని, అదే ఇప్పడు రకరకాల ఆందోళనలకు దారి తీసిందని తెలుస్తోంది.

ప‌చ్చ బ్యాచ్  ఇలా దొరికేసింది

ధైర్యవంతుడినే కానీ, ఫూల్ ని కాదు