'ఆర్‌ఆర్‌ఆర్' తర్వాత తారక్ నటించే చిత్రం ఏదవుతుందనే దానిపై ఇప్పటికే పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా సినిమా కోసమని తారక్ అట్లీ లేదా ప్రశాంత్ నీల్‌తో చేస్తాడనే ప్రచారం జరిగింది.
కానీ ఎన్టీఆర్ మాత్రం తన ఇమేజ్ తెలిసిన తెలుగు దర్శకుడితోనే చేయడం ఉత్తమమని నిర్ణయించుకున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక హాసిని సంస్థలో ఈ చిత్రం వుండవచ్చునని అంటున్నారు.
ఆర్‌ఆర్‌ఆర్ కనుక ఘన విజయం సాధించి, ఎన్టీఆర్‌కి పాన్ ఇండియా మార్కెట్ వస్తే దీనినే భారీ స్థాయిలో తెరకెక్కిస్తారు. పాన్ ఇండియా మార్కెట్ వచ్చినంత మాత్రాన తెలుగు రూట్స్ వదిలేసి నేల విడిచి సాము చేయడానికి తారక్ ఇష్టపడడం లేదు.
పర భాషా దర్శకులతో రిస్క్ చేయడం కంటే త్రివిక్రమ్, కొరటాలలాంటి సమర్ధులైన తెలుగు దర్శకుల పేర్లు మాత్రమే కన్సిడర్ చేస్తున్నాడు.
విశేషం ఏమిటంటే 'ఆర్‌ఆర్‌ఆర్'లో మరో హీరో అయిన రామ్ చరణ్ కూడా ఇలాగే ఆలోచిస్తున్నాడు.
ఈ చిత్ర ఫలితం ఏదయినా కానీ తన తదుపరి చిత్రాన్ని పరభాషా దర్శకుడితో చేయడానికి ఇష్టపడడం లేదు. కొరటాల శివతో ఎప్పట్నుంచో పెండింగ్‌లో వున్న ప్రాజెక్ట్‌ని చరణ్ లైన్‌లో పెట్టి వుంచాడు.