తన ఇమేజ్ గురించి కానీ, బాడీలాంగ్వేజ్ గురించి కానీ, నటన గురించి కానీ, తన అభిమానుల ఇష్టాయిష్టాల గురించి కానీ తెలియని పర భాషా దర్శకులతో పని చేయడం కంటే, తన గురించి అన్నీ తెలిసిన, తనతో ఆల్రెడీ సినిమా తీసిన దర్శకుడితోనే 'ఆర్.ఆర్.ఆర్' ఫాలో-అప్ సినిమా చేయాలని తారక్ డిసైడయ్యాడు. 'అరవింద సమేత'లో తనని డైరెక్ట్ చేసిన త్రివిక్రమ్‌తోనే తారక్ తదుపరి చిత్రం వుంటుంది.
అయితే అది రెగ్యులర్‌గా త్రివిక్రమ్ చేసే ఫ్యామిలీ డ్రామాల్లా కాకుండా పాన్ ఇండియా అప్పీల్ వున్న అంశంతో వుంటుందనే టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ ఇంతవరకు తన కంఫర్ట్ జోన్ బయటకు వచ్చింది లేదు. ఏ హీరోతో సినిమా చేసినా కానీ ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, కామెడీ టెంప్లేట్‌ని విడిచి పెట్టడం లేదు. కానీ తారక్‌కి 'ఆర్.ఆర్.ఆర్.'తో వస్తుందని భావిస్తోన్న పాన్ ఇండియా మార్కెట్‌కి అనుగుణంగా త్రివిక్రమ్ ఓ సబ్జెక్ట్ రెడీ చేస్తున్నాడట.
రెండు వందల కోట్లకి పైగా బడ్జెట్‌తో రూపొందే ఈ చిత్రం 'ఆర్.ఆర్.ఆర్.' నుంచి ఎన్టీఆర్ ఫ్రీ అయిన కొద్ది రోజులకే మొదలవుతుందట. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన చర్చలయితే ముమ్మరంగా జరుగుతున్నట్టు భోగట్టా.