Advertisement

Advertisement


Home > Movies - Movie News

అర్థరాత్రి సెట్స్ పైకొచ్చిన తారక్ సినిమా

అర్థరాత్రి సెట్స్ పైకొచ్చిన తారక్ సినిమా

ఎన్టీఆర్-కొరటాల సినిమా లాంఛనంగా మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. రాత్రి ఈ మూవీ సెట్స్ పైకి వచ్చింది. తారక్ పై కొన్ని మాంటేజ్ షాట్స్ తీశారు.

ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలైన విషయాన్ని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు బయటపెట్టారు. మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ తో కలిసి దిగిన ఫొటోల్ని షేర్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ లో ఓ భారీ బోటు సెట్ కనిపిస్తోంది.

కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఓ కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు.

యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై రాబోతోంది ఈ మూవీ. హాలీవుడ్ స్టార్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఈ సినిమాకు కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలు కంపోజ్ చేయబోతున్నాడు.

ఎన్టీఆర్ కెరీర్ లో 30వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏప్రిల్ 5, 2024న రిలీజ్ చేయబోతున్నారు. త్వరలోనే మరికొంతమంది కీలక నటీనటులకు సంబంధించిన వివరాలతో పాటు, షూటింగ్ అప్ డేట్స్ తో అఫీషియల్ ప్రకటన చేయబోతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?