Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఎన్టీఆర్ సమస్య…తెలుగుదేశం

ఎన్టీఆర్ సమస్య…తెలుగుదేశం

ఆర్ఆర్ఆర్ ఆస్కార్ క్రెడిట్ ను పబ్లిసిటీ రూపంలో క్యాష్ చేసుకోవడంలో హీరో రామ్ చరణ్ చాలా ముందుకు వెళ్లిపోయారు. ఎన్టీఆర్ మాత్రం బాగా అంటే బాగా వెనుకబడిపోయారు. 

హైదరాబాద్ నుంచి ముంబాయి..ఢిల్లీ మీదుగా అమెరికా వరకు రామ్ చరణ్ హడావుడి మామూలుగా లేదు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఏ హడావుడి లేకుండా అలా వున్నారు. కొత్త సినిమా అప్ డేట్ అడిగితే సినిమా ఆపేస్తా అంటూ అభిమానులతో సరదాగా జోక్ కట్ చేస్తున్నారు.

ఏమిటిదంతా? అసలు ఏం జ‌రుగుతోంది? అంటే…ఎన్టీఆర్ కు కూడా పబ్లిసిటీకి అవకాశం వుండే ఆఫర్లు వస్తున్నాయట. కానీ స్ట్రిక్ట్ గా ఒక్కటే చెబుతున్నారని తెలుస్తోంది. నాట్..నాట్..వన్ పర్సంట్ కూడా పొలిటికల్ టచ్ ఎక్కడా కిలో మీటర్ దూరంలో కూడా కనపడకూడదట. అలా అయితేనే ఓకే అంటారట. 

కొన్నాళ్ల క్రితం అమిత్ షా ను కలిసినపుడు సోషల్ మీడియాలో నానా హడావుడి జ‌రిగింది. ఇకపై అస్సలు పొలిటికల్ టచ్ అన్నది తనకు సమీప భవిష్యత్ లో వద్దని ఎన్టీఆర్ డిసైడ్ అయ్యారట.

ఓ నేషనల్ ఛానెల్ ఎన్టీఆర్ ను ఓ కార్యక్రమానికి ఆహ్వానిస్తే, దానికి ఓ పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ వుందని తెలిసి నో చెప్పారట. అలాగే ఢిల్లీ వెళ్లి పెద్దలను కలిసే సూచన వచ్చినా వద్దని చెప్పారట. 

మొత్తం మీద ఇవన్నీ తెలుగుదేశం పార్టీ బంధాలు ఎన్టీఆర్ కుటుంబానికి వుండడం వల్లనే అనుకోవాలి. ప్రస్తుతానికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ విషయంలో మౌనంగా వున్నారు. అందుకే అదే బంధాలతో చాలా పనులు వద్దనుకుంటున్నారు అని తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?