Advertisement

Advertisement


Home > Movies - Movie News

బీజేపీ మెచ్చుకోలు.. రామ్ చరణ్ కా.. ఆర్ఆర్ఆర్ కా..?

బీజేపీ మెచ్చుకోలు.. రామ్ చరణ్ కా.. ఆర్ఆర్ఆర్ కా..?

ఆర్ఆర్ఆర్ సినిమాకు ఇలా ఆస్కార్ అవార్డ్ వచ్చిందో లేదో అలా ఢిల్లీలో వాలిపోయాడు రామ్ చరణ్. నిజానికి అవార్డ్ వచ్చినా, రాకున్నా అతడు ఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమానికి హాజరవ్వాల్సి ఉంది. అదృష్టవశాత్తూ అవార్డ్ రావడంతో.. చరణ్ ఢిల్లీ పర్యటనకు మరింత ప్రాధాన్యం పెరిగింది.

ఢిల్లీలో దిగిన వెంటనే ప్రధాని మోడీతో చరణ్ సమావేశమౌతాడంటూ మెగా కాంపౌండ్ నుంచి ఫీలర్లు వచ్చాయి. ఆస్కార్ గెలిచిన సినిమాలో నటుడు కాబట్టి, పీఎం అపాయింట్ మెంట్ ఈజీగా దొరుకుతుందని అంతా అనుకున్నారు. కానీ మోదీ బదులుగా అమిత్ షా ఆ బాధ్యత తీసుకున్నారు.

తండ్రి చిరంజీవితో కలిసి అమిత్ షాను కలిసిన చరణ్, మినిస్టర్ నుంచి అపూర్వ స్వాగతం అందుకున్నారు. అంతకంటే ముందు పలువురు బీజేపీ నేతలు చరణ్ ను మెచ్చుకున్నారు, ఆర్ఆర్ఆర్ ను పొగిడారు. కేవలం చరణ్ కోసం బీజేపీ ఇలా చేస్తోందా.. ఆర్ఆర్ఆర్ టీమ్ మొత్తాన్ని గౌరవించే ఉద్దేశం ఆ పార్టీకి ఉందా లేదా అనే చర్చ ఇప్పుడు మొదలైంది.

నిజానికి ఆర్ఆర్ఆర్ హీరోల్ని అభినందించాలనుకుంటే తారక్ అందుబాటులోనే ఉన్నాడు. ఒక్క కబురు చేస్తే, రెక్కలు కట్టుకొని ఢిల్లీలో వాలిపోతాడు. కానీ అలా జరగలేదు. పూర్తిగా చిరంజీవి కనుసన్నల్లో ఈ భేటీ జరిగిందనే విషయం బహిరంగ రహస్యం.

ఆర్ఆర్ఆర్ కు సముచిత గౌరవం దక్కుతుందా..?

కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు కేవలం చరణ్-చిరంజీవికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తోందా లేక ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కు గౌరవం ఇస్తుందా అనే విషయం మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. ఇప్పటికే రాజ్యసభలో ఈ సినిమాకు అపూర్వ గౌరవం దక్కింది. పెద్దల సభలో ఆర్ఆర్ఆర్ పై అంతా ప్రశంసల వర్షం కురిపించారు.

అయితే ఇది చాలదు. ఆస్కార్ అవార్డ్ అందుకున్న చిత్రానికి ప్రత్యేకంగా అభినందన కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిందే. అదే ఓ బాలీవుడ్ చిత్రానికి ఈ అవార్డ్ వచ్చినట్టయితే, ఈపాటికే దేశవ్యాప్తంగా మారుమోగిపోయేది. కాబట్టి ఈ విషయంలో బీజేపీ సర్కార్ మరింత చొరవ తీసుకొని ఆర్ఆర్ఆర్ యూనిట్ కు సన్మాన కార్యక్రమాలు ఏర్పాటుచేయాలి. అలా చేస్తుందా లేక చరణ్ ను కలిసి అభినందనలు తెలియజేయడంతోనే ఆపేస్తుందా అనేది తేలాల్సి ఉంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?