Advertisement

Advertisement

indiaclicks

Home > Politics - National

నీటి అడుగున 100 రోజులు.. ఆయన ఏం సాధిస్తాడు?

నీటి అడుగున 100 రోజులు.. ఆయన ఏం సాధిస్తాడు?

ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని నీటి అడుగుకి వెళ్లేవారు కొన్ని నిమిషాల వ్యవధిలోనే తిరిగి పైకి రావాల్సి ఉంటుంది. అంటే నీటి అడుగున ఆక్సిజన్ ఉన్నా కూడా ఆ పీడనాన్ని మనిషి తట్టుకోవడం చాలా కష్టం. అందుకే పైకి వచ్చి తిరిగి లోపలికి వెళ్తారు. సబ్ మెరైన్ జీవనం కూడా చాలా క్లిష్టమైనది. నీటి అడుగున ఉన్నా కూడా అందులో అన్ని సౌకర్యాలు, మనిషికి తోడుగా ఉంటాయి. కానీ ఫ్లోరిడాలోని ఓ యూనివర్శిటీ ప్రొఫెసర్ ఓ అద్భుతమైన ప్రయోగాన్ని మొదలుపెట్టారు. 100 రోజుల పాటు నీటి అడుగున నివశించేందుకు ప్లాన్ చేసుకున్నారు. మార్చి-1న ఈ ఒంటరి ప్రయాణం మొదలైంది.

డాక్టర్ జోసెఫ్ డిటురి అలియాస్ డాక్టర్ డీప్ సీ.. ఆయన నీటి అడుగున నివాసంపై ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్నిరోజుల పాటు ప్రత్యేకంగా తయారు చేయించుకున్న క్యాబిన్ లో నీటి అడుగున ఉండటం అలవాటు చేసుకున్నాడు. ఇప్పుడు దాన్ని ప్రయోగంగా అమలు చేస్తున్నాడు. నెప్ట్యూన్ 100 పేరుతో 100 రోజుల పాటు నీటి అడుగున 30 అడుగుల లోతులో ఒంటరిగా నివశించేందుకు డాక్టర్ డీప్ సీ సిద్ధమయ్యాడు. ఆ ప్రయాణం మొదలైంది కూడా.

సముద్రం అడుగున ఒకటిన్నర రెట్లు ఎక్కువ పీడనం ఉంటుంది. ఆ పీడనాన్ని తట్టుకుని అక్కడే ఉండటం, చుట్టూ జలచరాల మధ్య ఒంటరిగా జీవించడం.. అనేదానిపై అధ్యయనం చేస్తున్నాడు డాక్టర్ డిటురి. సరిపడా ఆక్సిజన్ నిల్వలు ఉంచుకున్నాడు. కొన్ని పండ్లు, వంట సామాన్లు సిద్దం చేసుకున్నాడు. కాఫీ మేకర్ కూడా తనతో ఉంచుకున్నాడు.

మధ్య మధ్యలో ఆసక్తిగల విద్యార్థులకు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. ఆయన్ను చూసేందుకు నీటి అడుగుకి వెళ్లి, ఆయన్ను ఇంటర్వ్యూ చేసేందుకు విద్యార్థులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే.. అత్యథిక రోజులు నీటి అడుగున నివశించిన వ్యక్తిగా డాక్టర్ డిటురి రికార్డ్ సృష్టిస్తాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?