ఆ సినిమా ప్రచారం.. ఈ సినిమాకు హైప్

సినిమా ప్రచారం కోసం సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు చేయించడం ఈమధ్య కొత్త ట్రెండ్. తమతమ పరిచయాలు, సర్కిల్స్ కు తగ్గట్టు ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేయించి, సినిమాలకు ప్రచారం చేయిస్తున్నారు. Advertisement ఆమధ్య ఓ సినిమాకు ప్రభాస్…

సినిమా ప్రచారం కోసం సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు చేయించడం ఈమధ్య కొత్త ట్రెండ్. తమతమ పరిచయాలు, సర్కిల్స్ కు తగ్గట్టు ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేయించి, సినిమాలకు ప్రచారం చేయిస్తున్నారు.

ఆమధ్య ఓ సినిమాకు ప్రభాస్ ఇంటర్వ్యూ చేశాడు. మరో సినిమా ప్రచారం కోసం సిద్ధు జొన్నలగడ్డ యాంకర్ గా మారాడు. ఇలా చెప్పుకుంటూపోతే చాలామంది స్టార్స్, మరో హీరోకు ప్రచారం చేసిన సందర్భాలున్నాయి. దాని వల్ల ఆ సినిమాలకు మంచి ప్రచారం జరిగింది కూడా. అయితే తాజాగా వచ్చిన ఓ సినిమాకు మాత్రం రివర్స్ లో ప్రమోషన్ జరిగింది. అదే ఇక్కడ వెరైటీ.

కార్తికేయ హీరోగా నటించిన సినిమా భజే వాయువేగం. ఈ సినిమా ప్రచారంలో భాగంగా దర్శకుడు సుజీత్ ను రంగంలోకి దించారు. యూవీ క్రియేషన్స్ కాంపౌండ్ దర్శకుడీయన. పైగా భజే వాయువేగం సినిమా దర్శకుడికి, ఇతడికి మంచి స్నేహం ఉంది.

అందుకే కార్తికేయ సినిమా ప్రచారం కోసం సుజీత్ వచ్చాడు. దర్శకుడు, హీరోను ఇంటర్వ్యూ చేసే బాధ్యత తీసుకున్నాడు. అయితే ఈ ఇంటర్వ్యూతో భజే వాయువేగం సినిమా కంటే, సుజీత్ సినిమాకు ఎక్కువ ప్రచారం దక్కింది. అదే ఓజీ.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో ఓజీ సినిమా చేస్తున్నాడు సుజీత్. ఇంటర్వ్యూలో భాగంగా ఓజీ వివరాలు బయటపెట్టాడు. భజే వాయువేగం సినిమా హైలెట్స్ కంటే, ఓజీ గురించి సుజీత్ చెప్పిన వివరాలే ఎక్కువగా మీడియాలో హైలెట్ అయ్యాయి. అలా భజే వాయువేగం సినిమాకు ప్రచారం చేద్దామనుకుంటే, ఓజీ సినిమాకు హైప్ వచ్చింది.