పవన్- సుజిత్ కాంబినేషన్ లో డివివి దానయ్య నిర్మిస్తున్న సినిమా ఓజి. పవన్ కు పెద్దగా ఇబ్బంది లేకుండా, తక్కువ వర్క్, ఎక్కువ పేమెంట్ అనే టైపులో దర్శకుడు త్రివిక్రమ్ సెట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. జస్ట్ ముఫై రోజులు వర్క్ చేస్తే చాలు. చకచకా షూటింగ్ జరిగింది. మరో పది రోజులు పవన్ కళ్యాణ్ వర్క్ చేస్తే చాలు సినిమా పూర్తయిపోతుంది. సినిమాకు ఇప్పటికే మంచి బజ్ వచ్చింది. పవన్ అభిమానులు ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు.
కానీ రాజకీయాలు, ఎన్నికల కారణంగా ఈ సినిమాకు లెగ్ బ్రేక్ పడిపోయింది. ఎన్నికలు, ప్రచారం, గెలవడం, ఏకంగా ఇప్పుడు మూడు నాలుగు శాఖలకు మంత్రి కావడం చకచకా జరిగిపోయింది. మరి ఈ నేపథ్యంలో పవన్ ఓజి సినిమాను పూర్తి చేస్తారా? చేయగలరా? ఎప్పుడు చేస్తారు అన్నది ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
హరి హర వీరమల్లు షూట్ కూడా చేయాల్సి వుంది. ఓజి సినిమాకు కనీసం పది రోజులు డేట్ లు కేటాయించాల్సి వుంది. సెప్టెంబర్ 27న వస్తుంది అనుకుంటే వాయిదా పడిపోయింది. మరి ఏమిటి సంగతి అంటే.. ఓజి సినిమాకు రెండు కీలక అడ్డంకులు వున్నాయని తెలుస్తోంది.
ఒకటి డిజిటల్ అమ్మకాలు. ఓజి సినిమాకు నాన్ థియేటర్ అమ్మకాలు జరగలేదు. డిజిటల్ అమ్మకం జరిగితే, వాళ్లు స్లాట్ చూసి చెబుతారు, దానికి అనుగుణంగా థియేటర్ రిలీజ్ డేట్ వేసుకోవాల్సి వుంటుంది.
రెండవది ఎన్నికల సందర్భంగా పవన్ తెగ తిరిగారు. ఎండల్లో విపరీతంగా పర్యటించారు. వేళ అన్నది లేకుండా, టైమ్ కు తినకుండా నిర్విరామంగా ప్రచారం చేసారు. దాని వల్ల ఫేస్ లో కొంత తేడా వచ్చింది. పవన్ గట్టిగా పది రోజులు వర్కవుట్ చేస్తే మళ్లీ మారిపోతారు. అందువల్ల ఆ పని కూడా చేయాల్సి వుంది.
ఈ రెండు కారణాల వల్ల ఓజి ఎప్పుడు పూర్తవుతుంది. ఎప్పుడు విడుదలవుతుంది అన్నది ప్రస్తుతానికి అయితే తెలియదు.