విజ‌యవాడలో ఓజి షూట్!

పవన్ కళ్యాణ్ సినిమా సెట్ మీదకు రావాలనే యోచనలోనే వున్నారు. కానీ ఒప్పుకున్న మంత్రి వర్గ బాధ్యతలు పవన్ కు ఊపిరాడనివ్వడం లేదు. ఉదయం తొమ్మిది నుంచి రాత్రి పొద్దు పోయేవరకు ఒకటే మీటింగ్…

పవన్ కళ్యాణ్ సినిమా సెట్ మీదకు రావాలనే యోచనలోనే వున్నారు. కానీ ఒప్పుకున్న మంత్రి వర్గ బాధ్యతలు పవన్ కు ఊపిరాడనివ్వడం లేదు. ఉదయం తొమ్మిది నుంచి రాత్రి పొద్దు పోయేవరకు ఒకటే మీటింగ్ లు, కార్యక్రమాలు. వచ్చి పోయే అధికారులతో ఊపిరి సలపడం లేదు. కానీ కమిట్ అయిన సినిమాలు పూర్తి చేయాల్సి వుంది. అందులో ముఖ్యంగా హరి హర వీరమల్లు, ఓజి సినిమాలు పూర్తి చేయాలి. ఎక్కువ వర్క్ కూడా పెండింగ్ లేదు.

ఇప్పటికే హరి హర వీర మల్లు షూట్ ప్రారంభమైంది. పవన్ లేకుండానే. మరి ఏం సీన్లు చేస్తున్నారో తెలియదు. అది వేరే సంగతి. ఓజి సినిమా షూట్ ను సెప్టెంబర్ మూడో వారం తరువాత లేదా అక్టోబర్ మొదటి వారం నుంచి చేయాలనే సంకల్పంతో పవన్ వున్నారు. అలా చేయడానికి వీలుగా తన పనులు సర్దుబాటు చేసుకుంటున్నారు. అయితే షూటింగ్ హైదరాబాద్ లో కాదు. విజ‌యవాడ పరిసర ప్రాంతాల్లోనే.

షూటింగ్ హైదరాబాద్ లో వుంటే పవన్ తన మంత్రిత్వ శాఖల పనులను పూర్తిగా పక్కన పెట్టేయాలి. అదే కనుక విజ‌యవాడలో అయితే షూటింగ్ గ్యాప్ లో చాలా పనులు ఫినిష్ చేయవచ్చు. రోజు మొత్తం మీద పవన్ నేరుగా నటించే సీన్లు, వాటి టైమ్ చూసుకుంటే అరగంట నుంచి గంట కూడా వుండదు. ఎందుకంటే సింగిల్ టేక్ లోనే ఓకె అవుతాయి కనుక. కానీ సెట్ మీద అన్నీ రెడీ చేయడం, అందరూ రెడీ కావడం, సెట్ రెడీ అనేంత వరకు పవన్ క్యారవాన్ లో కూర్చోవడం తప్ప చేసేది వుండదు.

విజ‌యవాడ అయితే ఈ గ్యాప్ లో తన పదవి పనులు కూడా చక్కబెట్టుకోవచ్చు. అందుకే ఓజి షూట్ విజయవాడలో ప్లాన్ చేస్తున్నారు. మరి హరి హర వీరమల్లు అక్కడ చేస్తారో, సెట్ ల్లో చేయాల్సి వుంటే ఇక్కడ చేస్తారో.. చూడాలి. మరి.

7 Replies to “విజ‌యవాడలో ఓజి షూట్!”

  1. కమ్మోడు అంటే దోపిడి N . నాగార్జున మొత్తం ఆస్తి విలువ 10 వేల కోట్ల రూపాయలు పైనే ఉంటుంది.

    కమ్మోడు అంటే దోపిడి D . సురేష్ మొత్తం ఆస్తి విలువ 8 వేల కోట్లు రూపాయలు ఉంటుంది.

    గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎవరైనా ఒక పొలమును తీసుకొని నేను డెవలప్ చేస్తాను నేను లోకల్ డెవలప్మెంట్ క్రియేట్ చేస్తాను అంటే 20 సంవత్సరాల్లో అది వాళ్ళ సొంతమవుతుంది ఇదే లాజిక్ ను ఉపయోగించి మనోడు 500 ఎకరాలు కొట్టేశాడు ఎలా అంటే విశాఖపట్నంలో 1999-2000 సంవత్సరంలో దాదాపు 500 ఎకరాలు గవర్నమెంట్ నుంచి తీసుకొని,  నేను డెవలప్ చేస్తాను, నేను లోకల్ ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేస్తాను అని చెప్పి , ఈ 20 సంవత్సరాల్లో ఎటువంటి వంటి డెవలప్మెంట్ చేయకుండా ఎటువంటి ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేయకుండా 20 సంవత్సరాలు అంటిపెట్టుకొని ప్లాట్లు పెట్టి అమ్మేశాడు దాదాపు 500-750 కోట్ల రూపాయల లాభం వచ్చింది

    1. వాడు పాలిటిక్స్ లో సక్సెస్ అయ్యాడు కాబట్టే ఈ రోజున నీ కడుపు మంటకు కారణం అయ్యాడు

Comments are closed.