తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఇప్పుడు ఇదివరలో లేనంత సమన్వయం ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురు శిష్యులు కావడమే అందుకు నిదర్శనం. పార్టీల మధ్య వైరుధ్యాలు ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ను పల్లెత్తు మాట అనరు అనే సంగతి అందరికీ తెలిసినదే.
ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల నడుమ 10 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి ఈ ఇద్దరు నాయకులు పూనుకున్నప్పుడు కచ్చితంగా పరిష్కారాల అన్వేషణ జరుగుతుందని అందరూ ఆశించారు. రెండు విడతలుగా భేటీలు జరిగాయి గాని.. నిర్మాణాత్మక పరిష్కారాలు ఏవి తెరమీదకు రాలేదు. సమస్యలన్నీ యధావిధిగా అలాగే ఉండిపోయాయి.
అయితే ఈ ఇద్దరు నాయకుల భేటీల ద్వారా విభజన సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయనే అభిప్రాయం.. తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు సన్నగిల్లిపోతోందా? అనే అభిప్రాయం ఇప్పుడు కలుగుతుంది. ఆయన ఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి.. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావలసిన నిధులు ఇంకా రాలేదని వాటిని వెంటనే ఇప్పించే ప్రయత్నం చేయాలని విన్నవించడం గమనార్హం.
2014- 15 లో కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన మొత్తం నిధులను ఆంధ్రప్రదేశ్ ఖాతాలోనే వేశారని, తెలంగాణ వాటా నిధులు తిరిగి ఇవ్వాలని తాము కోరుతున్నామని భట్టి విక్రమార్క అంటున్నారు. పెండింగ్ అంశాల మీద నిర్మలా సీతారామన్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరినట్లుగా చెబుతున్నారు.
ఇక్కడ ప్రజలకు అర్థం కాని సంగతి ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల నడుమ ఏవైతే విభజన సమస్యలు ఆపరిష్కృతంగా ఉన్నాయో.. వాటి గురించి ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు. తెలంగాణ డిప్యూటీ భట్టి విక్రమార్క కూడా ఆ భేటీలో స్వయంగా పాల్గొన్నారు. అయితే అలాంటి భేటీల వలన సమస్య పరిష్కారం అయ్యే అవకాశం లేదని ఆయన భావిస్తున్నారేమో అని అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి.
రేవంత్ రెడ్డి దృఢంగా వ్యవహరించి చంద్రబాబు నాయుడు నుంచి పట్టుదలగా తమ రాష్ట్రానికి దక్కవలసిన వాటాలను సాధిస్తారనే నమ్మకం డిప్యూటీలో లేకపోతే మాత్రం ఆలోచించాల్సిన విషయమే. తెలంగాణ అభివృద్ధి పట్ల, హక్కుల సాధన పట్ల రేవంత్ చిత్తశుద్ధిపై ప్రశ్నార్ధకాలను రేకెత్తించే లాగా ఢిల్లీ పర్యటనలో భట్టి విన్నపాలు కనిపిస్తున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Call boy works 8341510897
Call boy jobs available 8341510897
తెలంగాణ ఆర్ధిక మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి తో రాష్టానికి సంబందించిన విషయాలు కాకుండా, రేవంత్ మీద అపనమ్మకం తో, ఆంధ్ర మీద వ్యతిరేకం తో మాట్లాడినట్టు, భట్టి మెదడు లో చిప్ పెట్టి నువ్వు విన్నావన్నమాట, నవ్విపోదురు కాకా నాకేటి సిగ్గు అన్నట్టు వుంది నీ వ్యవహారం.
వీళ్ళు కెసిఆర్ తెరాస ని మించిన తెలంగాణా వాదులు గా పేరు తెచ్చుకోవాలి అనేమో, కొత్త సమస్య లు ఇక్కడ రాసింది ఇంకా టీటీడీ లో వాటా లాంటివి లేవనేత్తుతున్నారు.
vc available 9380537747