Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఒకే నెల- రెండు హర్రర్ సినిమాలు

ఒకే నెల- రెండు హర్రర్ సినిమాలు

ఏప్రిల్ నెలలో రెండు హర్రర్ జానర్ సినిమాలు వస్తున్నాయి. అసలే ఎన్నికల కాలం. టిల్లు స్క్వేర్ సినిమా మాంచి జోరు మీద వుంది. ఫ్యామిలీ స్టార్ విడుదల కాబోతోంది. ఇక ఆపైన మే 13 వరకు సినిమాలకు పెద్దగా చాన్స్ లేదు అనుకున్నా కూడా ప్రతి వారం ఒకటి రెండు సినిమాలు లైన్ లో వుండనే వుంటున్నాయి. అలా ఈ నెలలో వస్తున్న సినిమాల్లో రెండు హర్రర్ జానర్ సినిమాలు వున్నాయి.

గీతాంజలి మళ్లీ వచ్చింది. లవ్ మీ. ఆ రెండు సినిమాలు. వీటిలో లవ్ మీ సినిమా దిల్ రాజు కాంపౌండ్ నుంచి వస్తున్న తొలి హర్రర్ సినిమా అనుకోవాలి. మనిషి వెళ్లి కోరి దెయ్యాన్ని ప్రేమిస్తే అన్నది కాన్సెప్ట్. దెయ్యానికి కూడా ప్రేమను రుచి చూపిస్తే, ఇక దానికి భయపడాల్సిన పని లేదు కదా అనేమో. అందువల్ల కాస్త ఇంట్రస్టింగ్ గానే వుంటుందనిపిస్తోంది. పైగా వదిలిన టీజర్, సాంగ్ బాగానే ఆకట్టుకున్నాయి. దానికి తోడు పిసి శ్రీరామ్, కీరవాణి లాంటి టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు.

ఇక రెండో సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది. హర్రర్ కామెడీ లేదా హర్రర్ ఎంటర్ టైనర్ అంటే కావాల్సిన ముడిసరుకు ఓ భూత్ బంగ్లా, అరడజను మంది కమెడియన్లు. ఈ ఫార్ములా టాలీవుడ్ లో అరిగిపోయిన రికార్డు. ఇప్పుడు మళ్లీ అదే ఫార్ములా బుక్ ను బయటకు తీసి, ఈ సినిమా కథను వండినట్లు కనిపిస్తోంది. అదే కమెడియన్లు.. అలవాటైన డైలాగులు.. భయం అందించే వినోద ప్రయత్నం.

మొత్తం మీద ఈ రెండు హర్రర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఏమేరకు నిలబడతాయో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?