ఆ హీరో ది ఆ డైరక్టర్ ది పాత స్నేహమే. కానీ చాలా కాలం క్రితం కాస్త బ్రేకప్ అయింది. అప్పటి నుంచి ప్యాచప్ కోసం హీరో సైడ్ నుంచే కాస్త గట్టి ప్రయత్నాలే జరిగాయి.
డైరక్టర్ వైపు నుంచి కూడా పెద్దగా అభ్యంతరం లేదు. ఆఖరికి ఇన్నేళ్ల తరువాత ఆ మధ్యనే మళ్లీ బంధం కలిసింది. పాత బంధం ఒక్కసారిగా మళ్లీ కలిసేసరికి. ఇప్పుడు వ్యవహారం మామూలుగా లేదు.
ఆ హీరో..ఈ డైరక్టర్ ఒకటే ప్రేమించేసుకుంటున్నారని టాలీవుడ్ వర్గాల బోగట్టా. ఫోన్ పట్టుకుంటే ఆ హీరో..ఈ డైరక్టర్ లవర్స్ మాదిరిగా గంటలు గంటలు మాట్లాడేసుకుంటున్నారట.
రోజులో అవకాశం దొరికినపుడల్లా ఇదే తీరు అంట. సాధారణంగా ఈ దర్శకుడిని హీరోలు విపరీతంగా అభిమానిస్తారు. ఈయన కూడా వాళ్లతో అంతలా అల్లుకుపోతారు. అందులో కొత్తేం లేదు.
కానీ ఒకసారి బ్రేకప్ అయి, మళ్లీ కలిసిన తరువాత ఈ రేంజ్ బాండింగ్ అనేసరికి జనం కాస్త కొత్తగా చెప్పుకుంటున్నారు. అన్నట్లు ఇప్పటకే ఈ డైరక్టర్ కు మరో టాప్ హీరోకు మధ్య గురు శిష్యులంత బాండింగ్ వుంది.