Advertisement

Advertisement


Home > Movies - Movie News

మొన్నటి వరకు భైరవకోన.. ఇప్పుడు భైరవపురం

మొన్నటి వరకు భైరవకోన.. ఇప్పుడు భైరవపురం

ఊరు పేరు భైరవకోన.. మొన్నటివరకు గట్టిగా వినిపించిన పేరు. థియేట్రికల్ రిలీజ్ తర్వాత కూడా ఓటీటీలో కాస్త గట్టిగానే సౌండ్ చేసిన సినిమా ఇది. ఇప్పుడు భైరవపురం తెరపైకి వచ్చింది. ఓం భీమ్ బుష్ అనే సినిమా ఈ ఊరు చుట్టూనే తిరుగుతుంది.

ఇప్పటికే టీజర్ తో ఎట్రాక్ట్ చేసిన ఓం భీమ్ బుష్. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ సినిమా నుంచి ఈరోజు ట్రయిలర్ రిలీజ్ చేశారు. ట్రయిలర్ తో సినిమా స్టోరీ, జానర్ పై మరింత క్లారిటీ ఇచ్చింది యూనిట్. ముగ్గురు కుర్రాళ్ల క్రేజీ రైడ్ ఈ సినిమా. ఎలాంటి లాజిక్స్ ఆలోచించకుండా, క్రేజీ ఫన్ అందించే ఉద్దేశంతో ఈ సినిమా తీసినట్టు ట్రయిలర్ చూస్తే అర్థమౌతుంది.

తమను తాము శాస్త్రవేత్తలుగా చెప్పుకునే ముగ్గురు స్నేహితులు, భైరవపురం అనే గ్రామంలోకి ప్రవేశిస్తారు. ఏ టు జెడ్ సొల్యూషన్స్ పెట్టి గ్రామస్తుల్ని బురిడీ కొట్టిస్తుంటారు. అంతా సాఫీగా సాగిపోతున్న టైమ్ లో కొంతమంది సాధువులు ఎంటర్ అవుతారు. దెయ్యం పట్టిన సంపంగి మహల్ లో నిధిని కనుగొనే పని అప్పగిస్తారు.

ఇలా ఊహించని మలుపులు తిరుగుతుంది సినిమా. అయితే కథ ఎటు వెళ్లినా, కామెడీకి ఢోకా లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారనే విషయాన్ని ట్రయిలర్ లో చెప్పారు.

శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్.. తమ కామెడీ టైమింగ్ తో మెరిశారు. మరీ ముఖ్యంగా శ్రీవిష్ణు కామిక్ టైమింగ్, డైలాగ్ డెలివరీ బాగుంది. అక్కడక్కడ అడల్ట్ కామెడీలా అనిపించినప్పటికీ.. థియేటర్లలో నవ్వులు గ్యారెంటీ అనిపిస్తోంది ఈ ట్రయిలర్ చూస్తే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?