Advertisement

Advertisement


Home > Movies - Movie News

మళ్లీ అదే మాట.. దర్శకుడిపై ట్రోలింగ్

మళ్లీ అదే మాట.. దర్శకుడిపై ట్రోలింగ్

సినిమా విడుదల ఆలస్యమైతే ఏ మేకర్ అయినా ఏం చెబుతాడు.. ది బెస్ట్ ఔట్ పుట్ కోసం కష్టపడుతున్నాం, అందుకే వాయిదా వేశాం, వెయిట్ చేయండి అంటాడు. ఈ డైలాగ్ ను ఇప్పటికే ఎన్నోసార్లు వాడేశాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ సినిమాను ఎప్పటికప్పుడు వాయిదా వేయడం ఈ డైలాగ్ కొట్టడం అతడికి కామన్ అయిపోయింది.

గమ్మత్తైన విషయం ఏంటంటే.. సినిమా థియేట్రికల్ రన్ ముగిసి, ఓటీటీలోకి రాబోతున్న టైమ్ లో కూడా ప్రశాంత్ వర్మ ఇంకా ఈ డైలాగ్ వదల్లేదు. లెక్కప్రకారం ఈపాటికి హనుమాన్ సినిమా ఓటీటీలోకి రావాలి, ఇదిగో వస్తోంది.. అదిగో వస్తోంది అంటూ రోజులు గడిపేస్తున్నారు. తాజాగా మరోసారి ఓటీటీ ప్రేక్షకులకు ఆశాభంగం ఎదురైంది.

సరిగ్గా ఇలాంటి టైమ్ లో ప్రశాంత్ వర్మ ట్వీట్ పెట్టాడు. ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామని, దయచేసి అర్థం చేసుకొని ఓపిక వహించాలంటూ పోస్ట్ పెట్టాడు. దీంతో నెటిజన్లకు మండింది. ఓ రేంజ్ లో ఈ డైరక్టర్ పై విరుచుకుపడుతున్నారు.

విడుదలకు ముందు అదే మాట, రిలీజ్ తర్వాత కూడా అదే డైలాగా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఆల్రెడీ థియేటర్లలోకి వచ్చిన సినిమాకు, ఇంకా ది బెస్ట్ ఇవ్వడానికి ఏం ఉంటుందంటూ మరో నెటిజన్ పోస్ట్ పెట్టాడు. థియేట్రికల్ నుంచి వచ్చిన డబ్బులు ఇంకా సరిపోలేదా అంటూ ఒకరు కామెంట్ చేస్తే.. మరోసారి వాయిదా పడినప్పుడు డైలాగ్ మార్చమని మరొకరు పంచ్ వేశారు.

ఇలా పొద్దున్నుంచి హనుమాన్ దర్శకుడిపై ఓ రేంజ్ లో ట్రోల్ నడుస్తోంది. అసలు మేటర్ ఏంటంటే, ఈ సినిమా స్ట్రీమింగ్ కు వివిధ కంపెనీలతో చేసుకున్న అగ్రిమెంట్స్ పరంగా కొన్ని సమస్యలు తలెత్తాయి. వాటిని పరిష్కరించే పనిలో దర్శకనిర్మాతలు కిందామీద పడుతున్నారు. లేదంటే, మొన్న శివరాత్రికే సినిమా స్ట్రీమింగ్ కు వచ్చి ఉండేది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?