మరో 2 రోజుల్లో ఇంకో హీరోయిన్ పెళ్లి

ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకుంది. అదే టైమ్ లో హీరోయిన్ అక్ష కూడా పెళ్లిచేసుకుంది. తాజాగా మీరా చోప్రా కూడా వైవాహిక జీవితంలోకి ఎంటరైంది. ఇలా హీరోయిన్లంతా వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.…

ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకుంది. అదే టైమ్ లో హీరోయిన్ అక్ష కూడా పెళ్లిచేసుకుంది. తాజాగా మీరా చోప్రా కూడా వైవాహిక జీవితంలోకి ఎంటరైంది. ఇలా హీరోయిన్లంతా వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో 2 రోజుల్లో కృతి కర్బందా కూడా చేరబోతోంది.

ఢిల్లీకి సమీపంలో ఉన్న ఐటీసీ గ్రాండ్ భారత్ లో కృతి కర్బందా, పుల్కిత్ పెళ్లి చేసుకోబోతున్నారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ వివాహ వేడుక కోసం రిసార్ట్ మొత్తాన్ని బుక్ చేసింది ఈ జంట. ఇందులో మొత్తం 104 రూమ్స్ ఉన్నాయి. వీటిలో అత్యంత ఖరీదైన స్వీట్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఒక రాత్రికి 35వేల రూపాయల ఖరీదైన రూమ్స్ ఇవి.

రేపట్నుంచి కృతి కర్బాందా-పుల్కిత్ వివాహ వేడుకలు మొదలుకాబోతున్నాయి. దీని కోసం కృతి కర్బందా, పుల్కిత్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో వీళ్లు ఫొటోలకు పోజులిచ్చారు.

15వ తేదీన పుల్కిత్-కృతి కర్బాందా వివాహం జరగనుంది. అంతకంటే ఒక రోజు ముందు సంగీత్, మెహందీ ఫంక్షన్లు నిర్వహిస్తారు. ఇక పెళ్లి రోజు హల్దీ ఫంక్షన్ ఉంటుంది. పెళ్లి తర్వాత రిసెప్షన్ ను కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు.

నాలుగేళ్లుగా డేటింగ్ లో ఉన్నారు కృతి కర్బందా, పుల్కిత్. ఓ ఏడాది కిందట తమ రిలేషన్ షిప్ ను వీళ్లు బయటపెట్టారు. జనవరిలో కృతి కర్బందా, పుల్కిత్ నిశ్చితార్థం జరిగింది. తెలుగులో బోణి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది కృతి. ఆ తర్వాత కల్యాణ్ రామ్, మంచు మనోజ్, రామ్ లాంటి హీరోల సరసన సినిమాలు చేసింది. స్టార్ డమ్ రాకపోవడంతో, ఒక దశలో రామ్ చరణ్ కు అక్కగా కూడా నటించింది.