Advertisement

Advertisement


Home > Movies - Movie News

కుబేర సెట్స్ పైకొచ్చిన కింగ్

కుబేర సెట్స్ పైకొచ్చిన కింగ్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శివరాత్రి సందర్భంగా ఈ మూవీకి టైటిల్ ఎనౌన్స్ చేశారు. కుబేర అనే టైటిల్ పెట్టారు. అదే టైమ్ లో ధనుష్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. చిరిగిన దుస్తుల్లో బిచ్చగాడి గెటప్ లో ధనుష్ ను పరిచయం చేశారు.

ఇప్పుడీ సినిమాకు సంబంధించి బ్యాంకాంక్ లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయింది. ఈసారి నాగార్జున సెట్స్ లో ప్రత్యక్షమయ్యాడు. కుబేర సినిమాలో నాగార్జున కూడా నటించబోతున్నాడనే విషయం అందరికీ తెలిసిందే. ఇవాళ్టి నుంచి ఆయన సెట్స్ పైకి వచ్చాడు.

బ్యాంకాక్ లో నాగార్జునపై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించి వర్కింగ్ స్టిల్స్ కూడా రిలీజ్ చేశారు. ఆ స్టిల్స్ లో నాగ్ ను వెనక నుంచి చూపించారు.

ధనుష్-నాగార్జున హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతోంది. తన జానర్ నుంచి బయటకొచ్చి శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాలో నాగ్ పోర్షన్ ఎంత అనే అంశంపై చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, కుబేరలో నాగార్జునది గెస్ట్ రోల్ కాదు. దాదాపు మల్టీస్టారర్ రేంజ్ లో ఈ సినిమా ఉంటుంది. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?