Advertisement

Advertisement


Home > Movies - Movie News

విక్కీ డోనర్ కు బాబు లాంటి సినిమా ఇది!

విక్కీ డోనర్ కు బాబు లాంటి సినిమా ఇది!

విక్కీ డోనర్ సినిమాలో వీర్యకణాలు దానం చేసే పాత్రలో హీరో కనిపిస్తాడు. స్పెర్మ్ కాన్సెప్ట్ తో సినిమాలు రావడం అక్కడ్నుంచే మొదలయ్యాయి. అప్పట్లో ఆ సినిమా పెద్ద చర్చకు కూడా దారితీసింది. ఇప్పుడు దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ వస్తోంది గుడ్ న్యూస్ అనే మూవీ. ఏకంగా వీర్యకణాలు తారుమారు  అయితే పరిస్థితి ఏంటనే అంశాన్ని ఇందులో హిలేరియస్ గా చూపించారు.

పిల్లల కోసం అక్షయ్ కుమార్, దిల్జిత్ తమ వీర్యకణాల్ని దాచుకుంటారు. సరిగ్గా ఆ టైమ్ వచ్చేసరికి వీళ్ల స్పెర్మ్ బ్లాక్స్ తారుమారు అవుతాయి.

అక్షయ్ కుమార్ వీర్యకణాల్ని దిల్జిత్ భార్య కియరా అద్వానీ గర్భంలో... దిల్జిత్ స్పెర్మ్ ను అక్షయ్ భార్య కరీనాకపూర్ గర్భంలో ప్రవేశపెడతారు. ఇక అక్కడ్నుంచి ఈ రెండు జంటల మధ్య వ్యవహారం ఎలా నడిచిందనే విషయాన్ని సరదాగా చూపించారు.

ఈరోజు రిలీజైన ఈ ట్రయిలర్ అందర్నీ ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ట్రయిలర్ లో అక్షయ్ కుమార్ కామెడీ పీక్స్. డిసెంబర్ 27న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది.

రీసెంట్ గా హౌజ్ ఫుల్ 4తో తన కామెడీ టైమింగ్ ను చూపించిన అక్షయ్.. గుడ్ న్యూస్ మూవీతో మరోసారి హిలేరియస్ కామెడీ పంచబోతున్నాడు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?