బిగ్బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కొంత మందికి నచ్చి, కొంత మంది నచ్చకపోయిన సీజన్లు సీజన్లు పుట్టుకువస్తున్నాయి. సీజన్ మొదలైనప్పటి నుండి కొంత మంది ఫ్రీ పబ్లిసిటి ఇస్తుంటారు. అందులో ముఖ్యంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఉచిత ప్రచారం ఇస్తున్నట్లు కనపడుతోంది.
గత వారం మొదలైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 గురించి మాట్లాడిన నారాయణ.. బిగ్ బాస్ అనేది ఒక అనైతిక షో అని, డబ్బులకు కక్కుర్తి పడేవాళ్లు ఉన్నంత కాలం ఇలాంటి షోలు పుట్టుకొస్తునే ఉంటాయని, బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లే వారందూ వింత జంతువులు అన్న మాటలు మర్చిపోక ముందే ఇవాళ సీపీఐ రాష్ట్ర మహాసభలో కూడా బిగ్ బాస్ గురించి మాట్లడి మళ్లీ ప్రచారం కల్పించారు.
ఇవాళ నారాయణ సినీ హీరో నాగార్జునపైనా తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. డబ్బు సంపాదన కోసం బిగ్ బాస్ షో పేరుతో యువతను నాగార్జున చెడగొడుతున్నారని, తక్షణమే షోను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. బిగ్ బాస్ షో నిలుపుదల కోసం ఎంతటి పోరాటనికైనా సిద్ధం అని సృష్టం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రజ సమస్య లేనట్లు బిగ్ బాస్ గురించి పదేపదే మాట్లడటం ఎంత వరకు కరెక్ట్ అనేది సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణకే తెలియాలి. సినిమాలు, సీరియల్స్, ఏదైనా సినీ ప్రోగ్రామ్ అయినా జనాలకు నచ్చితే చూస్తారు లేకపోతే పక్కనా పెడతారు. ప్రజలకు పనికి వచ్చే పనులు చేస్తే కమ్యూనిస్టులను ప్రజల్లో ఉంటారు. లేకపోతే చరిత్రలో మాత్రమే మిగులుతారు. ఇప్పటికే అస్తిత్వం కొల్పోతున్న ఎర్ర జెండాల పార్టీలు ప్రజ పొరాటలు చేసి కాలం దాగట్టు నడుచుకుంటే పార్టీ పది కాలాలు ప్రజల్లో ఉంటుంది.