వీర నరసింహా రెడ్డి సినిమా ఫంక్షన్ కు మరో గంటలోనో, అరగంటలోనో పోలీసుల అనుమతి లభించే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు పోలీసు అధికారులు సమావేశమై చర్చిస్తున్నారు.
ఒంగోలులో ఫంక్షన్ చేయాలి అనుకున్నపుడు దర్శకుడు గోపీచంద్ మలినేని పరిచయం ద్వారా వైకాపా నేత బాలినేని ద్వారా పోలీసులను సంప్రదించారు. రెండు గ్రౌండ్స్ ను సజెస్ట్ చేసారు. దాంతో పోలీసలు ఒక గ్రౌండ్ ను ఒకె అన్నారు. అక్కడ ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఈ ఏర్పాట్లను పలువురు పోలీస్ అధికారులు చూసి, సలహాలు, సూచనలు కూడా ఇచ్చారు.
ఈలోగా చంద్రబాబు సభల్లో అనుచిత సంఘనటలను జరగడంతో పోలీస్ ఉన్నతాధికారులు పట్టణం మధ్యలో సమావేశానికి నో అన్నారు. అభిమానులు భారీగా వస్తారు కనుక ఇబ్బంది అయ్యే పరిస్థితి వుందని, వేరే చోటకి మార్చమని సూచించారు. అయితే అలా మార్చే చోట, ఇచ్చిన విఐపి, ఎమ్ఐపి పాస్ లకు అనుగుణంగా అన్ని కార్లు పట్టేలా ప్లేస్ వుండాలని కండిషన్ పెట్టారు. అన్ని కార్లు రావు అని నిర్వాహకులు..విఐపి లు కదా..కార్లలోనే వస్తారు కదా అని పోలీసులు మల్ల గుల్లాలు పడ్డారు.
ఆఖరికి మరి కొద్ది సేపట్లో అనుమతి వస్తుందని భావిస్తున్నారు. వైకాపా నాయకుడు బాలినేనితో దర్శకుడు గోపీచంద్ మలినేని కి పరిచయం వున్నా, ఆంధ్రలో పరిస్థితుల రీత్యా అనుమతి రావడం మాత్రం కష్టంగానే వుంది.