నేను సాయిధరమ్ తేజ్.. డబ్బులు కావాలి ప్లీజ్

మీకు ఇండస్ట్రీతో లింక్ ఉందా? కొంతమంది హీరోలు లేదా ప్రముఖులు మీకు పరిచయమా? అయితే మీతో సాయిధరమ్ తేజ్ టచ్ లోకి వస్తాడు. ఈ కరోనా కష్టకాలంలో కొంతమందికి సాయం చేయదలుచుకున్నానని.. వీలైతే డబ్బులు…

మీకు ఇండస్ట్రీతో లింక్ ఉందా? కొంతమంది హీరోలు లేదా ప్రముఖులు మీకు పరిచయమా? అయితే మీతో సాయిధరమ్ తేజ్ టచ్ లోకి వస్తాడు. ఈ కరోనా కష్టకాలంలో కొంతమందికి సాయం చేయదలుచుకున్నానని.. వీలైతే డబ్బులు పంపించమని కోరుతాడు. 

అడిగింది స్వయంగా హీరో. పైగా ఎక్కువ కాదు. 10-15 వేలు మాత్రమే. పొరపాటున డబ్బులు ట్రాన్స్ ఫర్ చేస్తే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే అతడు సాయిధరమ్ తేజ్ కాదు.

ఆన్ లైన్ లో ఇలాంటి మోసాలు జరగడం సర్వసాధారణం. చాలామంది ఫేస్ బుక్ ఖాతాలు ఇలానే హ్యాక్ అవుతుంటాయి. ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి, ఫ్రెండ్ రిక్వెస్ట్ ఓకే చేయగానే అర్జెంట్ గా డబ్బులు కావాలంటూ దందా షురూ చేస్తారు. అయితే సాయితేజ్ లాంటి హీరోకే ఈ పరిస్థితి ఎదురవ్వడంతో ఇది కాస్తా హాట్ టాపిక్ గా మారింది. దీనిపై సాయితేజ్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

“ఓ వ్యక్తి నాలా మారి, నాకు తెలిసిన కొంతమందితో టచ్ లోకి వెళ్తున్నాడు.. నాతో కలిసి నటించిన వాళ్లకు, ఇండస్ట్రీలో ఇతరులకు ఫోన్లు చేసి ఆర్థిక సాయం అడుగుతున్నాడు. దీనికి సంబంధించి చట్టపరమైన చర్యలకు సిద్ధమౌతున్నాను. నా పేరు చెప్పి డబ్బులు అడుగుతున్న అలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి.”

ఇలా తన పేరిట జరుగుతున్న ఆన్ లైన్ మోసాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు సాయితేజ్. ఈ కష్టకాలంలో ఆపన్నులకు సాయం చేసే అవకాశం తమకు ఇవ్వాలని, ఇలా అడ్డదారులు తొక్కి, నిజంగా సాయం అర్థించే వాళ్లకు తమ సహాయాన్ని దూరం చేయొద్దని రిక్వెస్ట్ చేశాడు సాయితేజ్.