మెగాహీరో వరుణ్ తేజ్ లేటెస్ట్ సినిమా ఆపరేషన్ వాలంటైన్. ఎయిర్ ఫోర్స్ దేశం కోసం చేసే పోరాటం నేపథ్యంలో నిర్మించిన సినిమా. బాలీవుడ్ సంస్థ సినిమాను నిర్మించడమే కాకుండా, హిందీలో కూడా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.
ఈ సినిమా మీద చాలా అంటే చాలా ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది వరుణ్ తేజ్. సరైన హిట్ కోసం చూస్తున్నారు. చేతిలో మరో ఒక్క సినిమా మాత్రమే వుంది. ఇలాంటి నేపథ్యంలో ఆపరేషన్ వాలంటైన్ సినిమా మంచి సక్సెస్ కావాల్సి వుంది.
వరుణ్ తేజ్ మాత్రం పాపం, తన లోపం లేకుండా విపరీతంగా సినిమా ప్రచారం మీద కష్టపడుతున్నారు. ముంబాయి వెళ్లి పదుల కోద్దీ ఇంటర్వూలు ఇచ్చి వచ్చారు. ఇక్కడ కాలేజీలు, ఇంటర్వూలు ఇలా ఏది పనికి వస్తుందంటే అది చేస్తూనే వున్నారు. ప్రస్తుతానికి మంచి సినిమా వస్తే చూద్దామనే మూడ్ లోనే వున్నారు ఆడియన్స్. కానీ ఒకటే సమస్య మార్చి నెల అంటే ఎగ్జామ్స్ సీజన్. ఒకటి కాదు రెండు కాదు అన్ని రకాల పరీక్షలు ఈ నెలలోనే.
అందువల్ల వాటిని అధిగమించి హిట్ కావాలంటే సూపర్ హిట్ టాక్ యునానిమస్ గా తెచ్చుకోవాల్సి వుంటుంది. ఇప్పటి వరకు జరిగిన, జరుగుతున్న పబ్లిసిటీ తీరుతెన్నులు చూస్తుంటే కాస్త చెప్పుకోదగ్గర ఓపెనింగ్ తెచ్చుకునేలా వుంది. ఆపై సినిమా కంటెంట్ ను బట్టి వుంటుంది వ్యవహారం. రేపు ట్రయిలర్ రాబోతోంది. సల్మాన్, రామ్ చరణ్ విడుదల చేయబోతున్నారు. ట్రయిలర్ కొంత వరకు క్లారిటీ ఇచ్చే అవకాశం వుంది సినిమా మీద.