మళ్లీ వాయిదా పడిన ‘ఆపరేషన్’

వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా ఆపరేషన్ వాలంటైన్. ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు ఈ హీరో. లెక్కప్రకారం ఈ సినిమా గతేడాదే విడుదలవ్వాలి. Advertisement డిసెంబర్ 8న ఆపరేషన్ వాలంటైన్ ను…

వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా ఆపరేషన్ వాలంటైన్. ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు ఈ హీరో. లెక్కప్రకారం ఈ సినిమా గతేడాదే విడుదలవ్వాలి.

డిసెంబర్ 8న ఆపరేషన్ వాలంటైన్ ను విడుదల చేయబోతున్నట్టు ముందుగా ప్రకటించారు. ఆ తర్వాత వాయిదా వేశారు. తిరిగి ఫిబ్రవరి 16న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు ఆ తేదీని కూడా మార్చేశారు.

ఆపరేషన్ వాలంటైన్ సినిమాను మార్చి 1న విడుదల చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు. ఈ మేరకు మరోసారి అధికారికంగా ప్రకటించారు. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను ఒకేసారి విడుదల చేయబోతున్నారు.

నిజానికి ఈ సినిమాకు బాక్సాఫీస్ బరిలో పెద్ద కాంపిటిషన్ లేదు. కావాలనుకుంటే వాళ్లు 16వ తేదీకే రావొచ్చు. టాలీవుడ్ బాక్సాఫీస్ లో భారీ పోటీ ఏం లేదు. ఎటొచ్చి బాలీవుడ్ లో ఫైటర్ సినిమా ఫ్లాప్ అయింది. ఆపరేషన్ వాలంటైన్ కూడా దాదాపు అదే జానర్ కు చెందిన సినిమా.

కాబట్టి కాస్త గ్యాప్ ఇచ్చి విడుదల చేస్తే మంచిదనే ఉద్దేశంతో, ఫిబ్రవరి నెలను స్కిప్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాతో మానుషి ఛిల్లర్ టాలీవుడ్ కు పరిచయమౌతోంది. వైమానిక దళ శక్తిసామర్థ్యాల్ని చాటిచెప్పేలా ఆపరేషన్ వాలంటైన్ సినిమాను తెరకెక్కించారు.