తెలుగు సినిమాలకు ఓటిటి అనేది ఇప్పుడు పెద్ద అండగా మారింది. కానీ అదే ఓటిటి ఇప్పుడు కొందరు హీరోల సినిమాలను పక్కన పెడతోందని తెలుస్తోంది.
కొందరు చిన్న హీరోల సినిమాలకు అస్సలు రేటింగ్ రావడం లేదన్న సంగతి గమనించిన ఓటిటి సంస్థలు నలుగురు అయిదుగురు చిన్న హీరోల పేర్ల ముందు ఇంటూ మార్క్ పెట్టేసిందని తెలుస్తోంది. అంటే ఈ హీరోల సినిమాలు ఓటిటి కి కొనరన్నమాట. కావాలంటే వ్యూస్ లెక్క ప్రకారం వేసుకోవడమే.
ఒక్క సినిమాతో సర్రున దూసుకువచ్చి ఆ తరువాత హిట్ లు లేకుండా వుండి, ప్రస్తుతం చేతిలో ఒక సినిమా అయినా వుందా లేదా అనుకుంటున్న హీరో ఒకరు, అలాగే ఇండస్డ్రీలో ఇంటి వాళ్లు వున్నా కూడా సరైన ప్రాఙెక్టులు లేక, ఏది పడితే అది చేస్తూ ఫ్లాపులు చూస్తున్న హీరో ఒకరు ఈ జాబితాలో వున్నారని తెలుస్తోంది. వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా హిట్ లు రాని ఒకరిద్దరు హీరోల పేర్లు కూడా ఈ జాబితాలోకి చేరాయని మరో టాక్.
నాన్ థియేటర్ ఆదాయం మీద ఆధారపడి ఏ హీరో దొరికితే ఆ హీరోతో సినిమాలు తీస్తున్న నిర్మాతలు ఇక జాగ్రత్తగా వుండాలేమో? లేదూ అంటే సినిమాలు తీసాక బొమ్మ అమ్ముడు పోక సినిమాలు బ్లాక్ అయిపోతాయి.