టాప్ డైరక్టర్ శంకర్ తో సినిమా అంటే అలాగే వుంటుంది. పాట తీసినా పది కోట్లు కావాలి. ఫైట్ తీసినా పది కోట్లు కావాలి. ఆయన భారీ తనం అలాంటిది.
నిర్మాత దిల్ రాజు..హీరో రామ్ చరణ్ కాంబినేషన్ లో శంకర్ డైరక్షన్ లో సర్కారోడు (వర్కింగ్ టైటిల్) రెడీ అవుతోంది. ఈ సినిమా కోసం ఆ మధ్య ఆర్ ఎఫ్ సి లో ఓ పాట చిత్రీకరించారు. జస్ట్ తొమ్మిది కోట్లకు పైగా ఖర్చయింది.
అలాగే ఆ మధ్య వేరే రాష్ట్రంలో ఓ ఫైట్ చిత్రీకరించారు దానికి కూడా పది కోట్లు ఖర్చయింది. విఎఫ్ఎక్స్ లు, సిజి, గ్రీన్ మ్యాట్ లు లేని రోజుల్లో శంకర్ సినిమాల్లో పాటలు కలర్ ఫుల్ గా చాలా భారీగా వుండేవి. ఇప్పుడు మళ్లీ అదే స్టయిల్ లో ఆయన పాటలు, ఫైట్లు చిత్రీకరిస్తున్నారు. అందుకే భారీగా సెటప్ చేస్తూ, ఖర్చు అవుతోందని బోగట్టా.
ఈ సినిమాలో చరణ్ రెండు గెటప్ ల్లో కనిపిస్తారు. స్టూడెంట్ గా ప్రభుత్వ ఉద్యోగిగా. ప్రస్తుతం ఈ స్టూడెంట్ గెటప్ లో వుండే కాలేజీ బ్యాక్ డ్రాప్ సన్నివేశాలు చిత్రీకరించడానికి అమృత్ సర్ ను లోకేషన్ గా ఎంచుకున్నారు. కొద్ది రోజుల్లో అక్కడ షూట్ ప్రారంభం కాబోతొంది. ఇప్పటికే ఈ సినిమా కోసం విశాఖలో హీరో ఇంటి సెట్ వేసారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కొంత షూట్ చేసారు.
ఈ సినిమా కోసం దాదాపు 300 కోట్లు బడ్జెట్ అంచనాతో ముందుకు వెళ్తున్నారు. 2023 ఏప్రిల్ సినిమా విడుదల అవుతుంది.