ప్యాడింగ్ సూపర్…మచ్చీ

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చి ట్రయిలర్ ఆన్ లైన్ లోకి విడుదలయ్యింది. పులివాసు డైరక్షన్ లో తయారైన ఈ సినిమాకు రిజ్వాన్ దర్శకుడు. కళ్యాణ్ దేవ్ సరసన రుచిత రామ్,…

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చి ట్రయిలర్ ఆన్ లైన్ లోకి విడుదలయ్యింది. పులివాసు డైరక్షన్ లో తయారైన ఈ సినిమాకు రిజ్వాన్ దర్శకుడు. కళ్యాణ్ దేవ్ సరసన రుచిత రామ్, రిచా చక్రవర్తి నటించిన ఈ సినిమా ట్రయిలర్ చూస్తుంటే కాస్త గట్టి అటెంప్ట్ నే చేసినట్లు కనిపిస్తోంది. 

కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాకుండా, కాస్త గట్టి కథనే అల్లుకున్నట్లు కనిపిస్తోంది. అజయ్, రాజేంద్ర ప్రసాద్, ప్రగతి, పృధ్వీ, ఇంకా చాలా భారీ తారగణమే కనిపిస్తోంది. థమన్ మ్యూజిక్ అందించిన ట్రయిలర్ లో హీరో వైపు నుంచి రకరకాల షేడ్స్ ను చూపించారు.

కేవలం లవ్ రొమాన్స్ సీన్లే కాకుండా ఎమోషన్, యాక్షన్ టచ్ కూడా జోడించారు. ఫ్యామిలీ సెంటిమెంట్ ను వదలలేదు. అయితే ఫన్ జోలికి మాత్రం వెళ్లినట్లు ట్రయిలర్ లో కనిపించలేదు. 

కలర్ ఫుల్ గా వుంది ట్రయిలర్. పండగపోటీలో నిల్చోవాలంటే ఇది మాత్రం సరిపోదు. ప్రీ పబ్లిసిటీ ఎలాగూ లేదు. మౌత్ టాక్ స్ప్రెడ్ అయితేనే సినిమా థియేటర్లలో నిల్చుంటుంది.