ఎక్కువ మాట్లాడితే బ్లాక్ చేస్తా.. డైరక్టర్ స్టయిల్

త్రివిక్రమ్ తీసిన ఓ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. ఇక్కడ జోకులేస్తే హీరో వేయాలి, సైడ్ క్యారెక్టర్లు నవ్వాలి అనేది ఆ డైలాగ్ సారాంశం. ఇప్పుడీ డైలాగ్ ను దర్శకుడు హరీశ్ శంకర్ తన…

త్రివిక్రమ్ తీసిన ఓ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. ఇక్కడ జోకులేస్తే హీరో వేయాలి, సైడ్ క్యారెక్టర్లు నవ్వాలి అనేది ఆ డైలాగ్ సారాంశం. ఇప్పుడీ డైలాగ్ ను దర్శకుడు హరీశ్ శంకర్ తన నిజజీవితానికి అన్వయించుకున్నాడు. ట్విట్టర్ లో తనకు నచ్చినట్టు స్పందిస్తాడు ఈ దర్శకుడు. అది అతడిష్టం. కానీ ఆ స్పందనపై ప్రతిస్పందన మాత్రం ఆయనకు నచ్చినట్టు మాత్రమే ఉండాలి. లేదంటే హరీష్ శంకర్ మనోభావాలు దెబ్బతింటాయి. వెంటనే బ్లాక్ చేసి పడేస్తాడు.

రీసెంట్ గా ర్యాండమ్ థాట్స్ అంటూ ఓ కొటేషన్ పెట్టాడు హరీశ్ శంకర్. “ఒక్కసారి క్యాచ్ ఇచ్చాక వెళ్లి పెవిలియన్ లో కూర్చోవాలి. నేను అలా కొట్టాలనుకోలేదు, ఇలా అనుకున్నా అని గ్రౌండ్ లో డిస్కషన్ పెట్టొద్దు.” ఇది హరీశ్ శంకర్ ర్యాండమ్ థాట్. దీనికి లైకులు, రీట్వీట్లు మాత్రమే కొట్టాలని బహుశా ఈ దర్శకుడు అనుకొని ఉండొచ్చు.

కానీ అతడికి నచ్చని రిప్లయ్ ఒకటి అందులో పడింది. “ఒకసారి మూవీ ఫ్లాప్ అయిన తర్వాత కూడా సక్సెస్ మీట్లు పెట్టి హిట్ అని చెప్పకూడదు. ఫ్లాప్ అని ఒప్పుకోవాలి.” హరీశ్ శంకర్ కు వచ్చిన సమాధానాల్లో ఒకటి ఇది.

సెలబ్రిటీస్ కు ఇలాంటి కామెంట్స్ చాలానే వస్తుంటాయి. చాలామంది వాటిని చూసీచూడనట్టు వదిలేస్తారు. మరికొంతమంది గట్టిగా రిప్లయ్ ఇస్తుంటారు. కానీ హరీశ్ శంకర్ మాత్రం ఇలాంటి వాళ్లందర్నీ వెంటనే బ్లాక్ చేస్తాడు. ఒక్కర్ని మాత్రమే కాదు, సదరు ఎకౌంట్ లో ఉన్న అందర్నీ బ్లాక్ చేసి పడేస్తాడు. ఈసారి కూడా అదే చేశాడు.

దువ్వాడ జగన్నాధమ్ సినిమా నుంచి హరీశ్ కు ఈ అలవాటు మొదలైంది. ఆ సినిమా మొదటి రోజు వసూళ్లపై చాలామంది నెటిజన్లు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆ తర్వాత 7 రోజుల కలెక్షన్లు చూసి హరీశ్ ను దుమ్మెత్తిపోశారు. కొంతమంది దిల్ రాజు ఆఫీస్ ను కూడా చుట్టుముట్టారు, అది వేరే విషయం. అప్పట్నుంచి హరీశ్ ఇలా బ్లాక్ చేసే కాన్సెప్ట్ అలవాటు చేసుకున్నాడు. ఇప్పటికీ తనకు నచ్చని వాళ్లను ఇలా బ్లాక్ చేస్తూనే ఉన్నాడు.

చూసీచూడనట్టు వదిలేయడం కంటే, ఘాటుగా ప్రతిస్పందించే కంటే, ఇలా బ్లాక్ చేసి ఊరుకోవడం బెటరని భావిస్తున్నాడు హరీశ్ శంకర్. ఇది ఈయన స్టయిల్.