సాయి ఫల్లవి అంటే చాలు కుర్రకారకు పూనకాలు వచ్చేస్తాయి. ఎంసిఎ, ఫిదా లాంటి సినిమాలు కళ్ల ముందు మెదుల్తాయి. ఆమె మాత్రమే చేయగలిగిన మ్యాజిక్ అంటూ ఒకటి వుంది. అది మళ్లీ మరోసారి స్క్రీన్ మీద చూపించబోతున్నారు శేఖర్ కమ్ముల. లేటెస్ట్ గా ఆయన క్రియేట్ చేస్తున్న లవ్ స్టోరీ సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది.
శేఖర్ కమ్ముల-చైతన్య-సాయి పల్లవి సినిమాకు లవ్ స్టోరీ అనే టైటిల్ ఫిక్స్ ఛేసినట్లు గతంలోనే గ్రేట్ ఆంధ్ర వెల్లడించింది. ఇప్పుడు అదే ఫిక్స్ చేస్తూ, ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఇచ్చారు. ప్రేమలో భావోద్వేగాలు క్లియర్ గా ప్రతిఫలించే విధంగా ఫస్ట్ లుక్ డిజైన్ చేసారు. నాగ్ చైతన్యకు లవ్ అండ్ రొమాంటిక్ సినిమాలు పక్కాగా నప్పుతాయి. హిట్ లు కూడా ఖాతాలో వున్నాయి. ఏమాయచేసావె, ప్రేమమ్, మనం, మజిలీ సినిమాలు అన్నీ ఈ లైన్ లో వచ్చినవే.
ఇప్పుడు ఆ వరుసలోనే శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ కూడా రాబోతొంది. సునీల్ నారంగ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సమ్మర్ విడుదల టార్గెట్ గా ఈ సినిమా రెడీ అవుతోంది.