‘పండగకు’ డీసెంట్ ఓపెనింగ్

దర్శకుడు మారుతి, హీరో సాయి తేజ్ కాంబినేషన్ లో యువి/గీతా బ్యానర్లపై బన్నీవాసు నిర్మించిన సినిమా 'ప్రతి రోజూ పండగే'. ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. కార్తీ దొంగ, బాలయ్య రూలర్, సల్మాన్ దబాంగ్…

దర్శకుడు మారుతి, హీరో సాయి తేజ్ కాంబినేషన్ లో యువి/గీతా బ్యానర్లపై బన్నీవాసు నిర్మించిన సినిమా 'ప్రతి రోజూ పండగే'. ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. కార్తీ దొంగ, బాలయ్య రూలర్, సల్మాన్ దబాంగ్ 3 లాంటి గట్టి సినిమాల పోటీని తట్టుకుని, తొలి రోజు మూడు కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. 

సినిమాకు కొన్ని చోట్ల ఫుల్స్, కొన్ని చోట్ల యావరేజ్ కలెక్షన్ల కనిపించాయి. బాలయ్య ప్రభావం వున్నచోట్ల కాస్త తగ్గాయి. అయితే ఫస్ట్ షో నుంచి సీన్ కాస్త మారింది. చిన్న గీత కన్నా పెద్ద గీత అన్నట్లుగా బాలయ్య రూలర్ కన్నా ప్రతిరోజూ పండగే బెటర్ అనిపించుకుంది. అందువల్ల శని, ఆది వారాలు కూడా ఈ సినిమాకే ఎడ్జ్ వుంటుంది.

వెంకీమామ డల్ అయిపోవడం, దబాంగ్ 3, దొంగ సినిమాలకు సరైన టాక్ రాకపోవడం కూడా సాయి తేజ్ సినిమాకు కలిసివచ్చింది. తొలి రోజు వసూళ్లు ఇలా వున్నాయి.

నైజాం………….1.25 కోట్లు
ఉత్తరాంధ్ర……33 లక్షలు
సీడెడ్…………….0.34 లక్షలు
ఈస్ట్………………..0.30 లక్షలు
వెస్ట్…………………22 లక్షలు
కృష్ణ…………………21 లక్షలు
గుంటూరు…………30 లక్షలు
నెల్లూరు……………18 లక్షలు