ఉన్నట్లుండి ఇండస్ట్రీలో ఓ విషయం గుప్పు మంది. నిర్మాతలు బెల్లంకొండ సురేష్-డివివి దానయ్యల నడుమ వివాదం నెలకొంది అన్నది విషయం. దీనిపై రకరకాలుగా వినిపిస్తోంది. కానీ విషయం స్థూలంగా అయితే ఇలా వుంది.
ఎప్పుడో, ఎక్కడో బెల్లంకొండ సురేష్ కొంత మొత్తం నిర్మాత దానయ్య దగ్గర అప్పుగా తీసుకున్నట్లు బోగట్టా. ఇది అలా అలా సెటిల్ మెంట్ వరకు వెళ్లి 80లక్షకు సెటిల్ మెంట్ జరిగినట్లు తెలుస్తోంది.
కానీ పేమెంట్ కాలేదని తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో మరేమయిందో కానీ, విషయం పోలీస్ ఫిర్యాదు వరకు వెళ్లిందని తెలుస్తోంది. నిర్మాత దానయ్య ఫోలీస్ కంప్లయింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే బాకీ కోసం పోలీస్ కంప్లయింట్ అనేది వుండదు. దానికి కోర్టులు వున్నాయి. ఫోన్ లో మాటా మాటా రావడంతో, ఆ మేరకు దానయ్య ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఇంతా చేసి ఇద్దరూ పెద్ద నిర్మాతలే. బెల్లంకొండ ఇద్దరు హీరోలకు తండ్రి. అందువల్ల 80 లక్షలు అన్నది పెద్ద మొత్తమే కాదు. మరి ఎక్కడ ఇగోలు దెబ్బతిన్నాయో, అసలు ఏం జరిగిందో తెలియాల్సి వుంది.