అవసరాల శ్రీనివాస్ సినిమాలు ఎలా ఉంటాయో ఆడియన్స్ కు ఓ ఐడియా ఉంది. తను తీసిన 2 సినిమాలతో ఓ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు ఈ దర్శకుడు. ఇప్పుడా ఇమేజ్ కు ఏమాత్రం తగ్గని విధంగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా రాబోతోంది. అదే ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి.
తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ లో అవసరాల మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. విజువల్స్, డైలాగ్స్ లో ఈ దర్శకుడి మార్క్ కనిపిస్తోంది. టీజర్ లో హీరో నాగశౌర్య, హీరోయిన్ మాళవిక నాయర్ కెమిస్ట్రీ బాగుంది. వాళ్ల కెమిస్ట్రీని కల్యాణి మాలిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత ఎలివేట్ చేసింది.
ఈ టీజర్ లో హీరోహీరోయిన్ల జీవితాల్ని వివిధ దశల్లో చూపించారు. ఒక్కో దశలో వాళ్లు ఎలా ఉన్నారు, స్నేహితుల నుంచి భార్యాభర్తలుగా ఎలా మారారనే విషయాన్ని సింపుల్ గా చూపించారు. అయితే కథలో కాన్ ఫ్లిక్ట్ ఏంటనే విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పలేదు. టీజర్ లో అలా టచ్ చేసి వదిలేశారంతే.
ఓ అందమైన ప్రేమకథను దర్శకుడు హార్ట్ టచింగ్ గా మరోసారి చూపించబోతున్నాడనే విషయం మాత్రం టీజర్ చూస్తే అర్థమౌతోంది. ఉగాది కానుకగా మార్చి 17న ఈ సినిమా రానుంది. పీపుల్ మీడియా, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.