పాపం..దర్శకుడు హరీష్ శంకర్ ను చూస్తే ఙాలేస్తుంది. కేవలం ఒక్క హీరో సినిమా కోసం అలా వుండిపోయి ఎన్ని కోట్ల ఆదాయాన్ని ఇన్నేళ్లలో కోల్పోయారో అన్న ఆలోచన వస్తే. ఈ పాటికి కనీసం రెండు సినిమాలు చేసున్నా కోట్లకు కోట్లు రెమ్యూనిరేషన్ కింద వచ్చి వుండేది. కొన్నాళ్ల పాటు వేరే సినిమాలు చేసి, ఆ తరువాత కథ నచ్చలేదని ఇలా పవన్ నెట్టుకుంటూ వస్తున్నారు హరీష్ సినిమాను.
గతంలో పవన్ కోసమే మైత్రీ మూవీస్ ఙనాలు థెరి రీమేక్ సబ్ఙెక్ట్ ను చాన్నాళ్లు ఖర్చులు భరించి తయారుచేయించారు. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దాన్ని రెడీ చేసారు. పవన్ చేయరు అని డిసైడ్ అయ్యాక, అన్నాళ్లు తమతో వున్నందుకు కొంత రెమ్యూనిరేషన్ ఇచ్చి పంపేసారు. గమ్మత్తేమిటంటే అదే థెరి రీమేక్ ను ఇప్పుడు సుఙిత్ డైరక్షన్ లో చేయడానికి పవన్ ను త్రివిక్రమ్ ఒప్పించారు.
ఈ సబ్ఙెక్ట్ ను మైత్రీ దగ్గర నుంచి తీసుకోవడమో లేదా మైత్రీ..డివివి దానయ్య కలిసి చేయడమో అన్న ప్లాన్ వేసారు. అలాంటి టైమ్ లో తన కథ నచ్చకుంటే అదే థెరి రీమేక్ ను తానే చేస్తాను అన్న ప్రతిపాదనను హరీష్ శంకర్ నిర్మాతల ముందు పెట్టినట్లు తెలిసింది. అది కూడా బాగానే వుందని మైత్రీ ఙనాలు ఈ ప్రతిపాదనను పవన్ ముందు వచ్చినట్లు తెలుస్తోంది.
దాంతో ఇప్పుడు ఆ ప్రాఙెక్టుకు కూడా బ్రేక్ పడింది. అంటే అక్కడ సబ్ఙెక్ట్ సమస్యనా? మైత్రీకి సినిమా చేయడం సమస్యనా అన్నది అనుమానంగా వుంది. మొత్తానికి దీని మధ్యలో పాపం హరీష్ నలిగిపోతున్నారు. ఒక మంచి కమర్షియల్ డైరక్టర్ సినిమాలు చేయకుండా అలా పక్కన కూర్చోవాల్సి వచ్చింది. కానీ తెరవెనుక ఆడిస్తున్నవారు మాత్రం నిర్మాతగా బ్యానర్లు వేసుకుంటూ, సినిమాలు చేసుకుంటూ కోట్లు గడిస్తున్నారని టాలీవుడ్ లో కామెంట్లు వినిపిస్తున్నాయి.