ఆర్జీవీ తీసిన “పవర్ స్టార్”కు కౌంటర్ గా వచ్చిన వెబ్ మూవీ పరాన్నజీవి. తమ ఆరాధ్య నాయకుడు కమ్ హీరోపై వర్మ సినిమా తీస్తే.. అతడి పరువు తీసేందుకు పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా తీశారు. అంతకుమించి ఈ “పరాన్నజీవి”కి ఏ లక్ష్యం కనిపించదు. వర్మ తీసిన పవర్ స్టార్ లో కనీసం ట్రయిలర్ లో చూపించిన మేటర్ అయినా ఉంది. ఈ పరాన్నజీవి అంతకంటే చెత్తగా ఉంది.
ఆర్జీవీలో ఉన్న నేర్పరితనం, చాతుర్యం పరాన్నజీవి దర్శకుడిలో కనిపించలేదు. దీంతో పరాన్నజీవిలో వేసిన సెటైరికల్ డైలాగ్స్.. జబర్దస్త్ కార్యక్రమాన్ని తలపిస్తాయి.
ఓవరాల్ గా పరాన్నజీవి వెబ్ మూవీని రామ్ గోపాల్ వర్మను ఓ ఉమెనైజర్ (స్త్రీలోలుడు)గా చూపించడానికి మాత్రమే కేటాయించారు. ఎలాంటి నైతిక విలువలు, కట్టుబాట్లు లేని ఓ ఫిలింమేకర్ ఎలా కాస్టింగ్ కౌచ్ కు పాల్పడ్డాడనేది ఈ సినిమా సారాంశం. ఇంతకుమించి ఈ 40 నిమిషాల వెబ్ మూవీలో చెప్పుకోడానికి పెద్ద కథకానీ, అంతకుమించి స్క్రీన్ ప్లే కానీ కనిపించదు. నిజంగా ఆర్జీవీకి గట్టి సమాధానం ఇవ్వాలనుకుంటే దర్శకుడు నూతన్ నాయుడు స్క్రిప్ట్ పై మరింత గట్టిగా వర్క్ చేయాల్సింది.
ఈ డైలాగ్స్ చూస్తే.. అతడ్ని చిల్లర మనిషిగా చూపించడానికి ఎలాంటి ప్రయత్నం చేశారో అర్థమౌతుంది
– లిఫ్ట్ కావాలంటే వేలు ఎత్తాలి.. క్యారెక్టర్ కావాలంటే ఏం ఎత్తాలో తెలీదా
– వోడ్కా నా పెగ్ లోకి రావాలి.. ఫిగర్ నా పక్కలోకి రావాలి
– తుపాకి పేల్చడం రాకపోయినా తూటాలు మాత్రం పక్కనుండాలి
– నేను వోడ్కా తాగుతున్నప్పుడు.. ఉమెన్ పక్కన ఉన్నప్పుడు నిజమే మాట్లాడతాను.
వెబ్ మూవీలో ఆర్జీవీ పాత్ర పోషించిన షకలక శంకర్ ఎప్పట్లానే అతడ్ని అనుకరించాడు. కత్తిమహేష్ సినీనిర్మాతగా కనిపించాడు. ఆర్జీవీ అసిస్టెంట్ గా నటించిన లక్ష్మణ్ ఓకే అనిపించాడు.
పెద్దగా ఆకట్టుకోని రైటింగ్, పేలవమైన దర్శకత్వం, పొందిక లేని సన్నివేశాలతో తెరకెక్కిన పరాన్నజీవి సినిమా.. వర్మ తీసిన “పవర్ స్టార్”ను ఓ మెట్టు పైన నిలబెట్టింది. పరాన్నజీవితో పోలిస్తే పవర్ స్టార్ చాలా బెటర్ వెబ్ మూవీ అనిపిస్తుంది. ఆర్జీవీని ఉమెనైజర్ గా చూపించడం మినహా ఈ సినిమా సాధించిందేమీ లేదు. నిజానికి మేకర్స్ కోరుకున్నది కూడా ఇదే.
బాటమ్ లైన్ – మరీ నాసిరకం