Advertisement

Advertisement


Home > Movies - Movie News

హ్యారీపోట‌ర్ ఫేం 'పాల్ గ్రాంట్' క‌న్నుమూత‌!

హ్యారీపోట‌ర్ ఫేం 'పాల్ గ్రాంట్' క‌న్నుమూత‌!

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు, హ్యారీపోట‌ర్ ఫేం పాల్ గ్రాంట్(56) క‌న్నుమూశారు. లండ‌న్ లోని ఓ రైల్వే స్టేష‌న్ స‌మీపంలో కుప్ప‌కూలిన ఆయ‌న్ను ఆస్ప‌త్రికి త‌రలించిగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

1980ల టైంలో విల్లో, లైబ‌ర‌న్స్ సినిమాల‌తో గుర్తింపు తెచ్చుకున్న ఆయ‌న‌.. హ్యారీపోట‌ర్, స్టార్ వార్స్ చిత్రాల‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా పాపుల‌ర్ అయ్యారు. స్పాండిలోపిఫిసిల్ డైస్పాల్సియా కాంజెనిట‌ల్ అనే జెనిటిక్ డిజార్డ‌ర్ కార‌ణంతో మ‌ర‌గుజ్జులా ఉండిపోయారు.

డ్రగ్, ఆల్కహాల్ తాగడం వ్యసనంగా మారిపోవ‌డంతో ప‌లు ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు. బ‌హుశా ఆయ‌న అకాల మ‌ర‌ణానికి అనారోగ్య స‌మ‌స్యలే కార‌ణంగా భావిస్తున్నారు. 2014లో కొకైన్ సేవిస్తూ దొరికిపోవ‌డంతో అప్ప‌ట్లో హాట్ టాపిక్ అయిపోయింది. కాగా ఆయ‌న‌కు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?