Advertisement

Advertisement


Home > Movies - Movie News

దసరా ట్రయిల్ షూట్ ఖర్చు ఎవరిది?

దసరా ట్రయిల్ షూట్ ఖర్చు ఎవరిది?

దసరా సినిమాకు సంబంధించి ఓ ముచ్చట వుంది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దసరా కథను హీరో నానికి నెరేట్ చేసారు. అయితే అంత స్పాన్ వున్న కొత్త తరహా కథను కొత్త దర్శకుడు హ్యాండిల్ చేయగలరో లేదో, అసలు తెర మీదకు ఎలా తెస్తారో అని అనుమానం వచ్చింది నానికి. 

దాంతో తానే కొంత అమౌంట్ ఇచ్చి ఓ టెస్ట్ షూట్ చేసి తీసుకురమ్మన్నా, అది చూసి నచ్చి అవకాశం ఇచ్చా అంటూ చెబుతున్నారు పలు ఇంటర్వూల్లో హీరో నాని. ఈ మేరకు నాని సూపరెహె అంటూ మీడియాలో వార్తలు కూడా కనిపించాయి.

కానీ వాస్తవం వేరు అని తెలుస్తోంది. ఈ టెస్ట్ షూట్ ఏర్పాట్లు, భారం అంతా కూడా నిర్మాతే భరించారని తెలుస్తోంది. ఇదే అసలు సిసలు వాస్తవం అని కూడా తెలుస్తోంది. కొన్ని లక్షల రూపాయలు కేవలం టెస్ట్ షూట్ కోసం నిర్మాత చేత హీరో ఖర్చు చేయించి, ఓకె అనుకున్నాకే దర్శకుడికి అవకాశం ఇచ్చారని బోగట్టా. ఆలా చేసిన లక్షల టెస్ట్ షూట్ ఖర్చు కూడా నిర్మాణ వ్యయంలోనే కలిసింది.

నిర్మాత చేత ఖర్చు చేయిస్తే నాని ఎందుకు తానే ఇచ్చానని చెప్పారు అన్నది ఓ క్వశ్చను. లేదా నాని చెప్పినది రాంగ్ గా క్యారీ అయిందా అన్నది మరో కశ్చను. ఏమైనా ఖర్చు ఒకరిది. వార్తల్లో కీర్తనలు మరొకరికి అన్నట్లు వుంది వ్యవహారం. ఏమైనా దసరా సినిమా పెద్ద హిట్ అయితే చాలు నిర్మాత హ్యపీ అవుతారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?