బిజీబిజీగా పవన్ కల్యాణ్.. రోజుకు 2 సినిమాలు

ప్రస్తుతం రాజకీయాల కంటే సినిమాలపైనే ఎక్కువగా దృష్టిపెట్టారు పవన్ కల్యాణ్. ఉదయం నుంచి సాయంత్రం వరకు సినిమాలు చేస్తున్నారు. సాయంత్రం నుంచి రాజకీయాలు చేస్తున్నారు. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇస్తున్న కాల్షీట్…

ప్రస్తుతం రాజకీయాల కంటే సినిమాలపైనే ఎక్కువగా దృష్టిపెట్టారు పవన్ కల్యాణ్. ఉదయం నుంచి సాయంత్రం వరకు సినిమాలు చేస్తున్నారు. సాయంత్రం నుంచి రాజకీయాలు చేస్తున్నారు. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇస్తున్న కాల్షీట్ లోనే 2 సినిమాల్ని పూర్తిచేస్తున్నారు పవన్. ఆ మేరకు ఒకే కాల్షీట్ ను 2 ముక్కలు చేసి, 2 సినిమా యూనిట్స్ కు కేటాయిస్తున్నారు.

నిన్న క్రిష్ సినిమా సెట్స్ పై జాయిన్ అయ్యారు పవన్. హరహర వీరమల్లు అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ సినిమాను ఉదయం 7 గంటలకు స్టార్ట్ చేశారు పవన్. 11 గంటల వరకు మాత్రమే షూట్ చేశారు. 11 గంటలకు ప్యాకప్ చెప్పి, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లో జాయిన్ అయ్యారు. సాయంత్రం 5 గంటలకు ఆ సినిమా షూటింగ్ ను కూడా పూర్తిచేశారు.

ఇక సాయంత్రం నుంచి రాజకీయాలతో బిజీ అవుతున్నారు. తన పార్టీకి చెందిన కీలకమైన వ్యక్తులతో సమావేశం అవ్వడం, ఏదైనా స్టేట్ మెంట్స్ ఇవ్వాల్సి ఉంటే వాటికి సంబంధించిన ప్రెస్ నోట్స్ ను పరిశీలించడం లాంటివి చేస్తున్నారు.

ఇలా ఒకే సినిమాకు ఇవ్వాల్సిన కాల్షీట్ ను 2 ముక్కలు చేసి, రెండు సినిమాలకు కేటాయిస్తున్నారు పవన్ కల్యాణ్. తన ప్రతి సినిమా సెట్స్ పై పవన్ ఉండేది కేవలం 4 గంటలు మాత్రమే. ఆ 4 గంటల్లోనే పవన్ నుంచి వీలైనన్ని ఎక్కువ సీన్స్ రాబట్టేందుకు సినిమా యూనిట్లు కిందామీద పడుతున్నాయి. మరీ ముఖ్యంగా క్రిష్ సినిమా కోసమైతే రాత్రి 3 గంటల నుంచే ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తోంది.

మీరు మారిపోయారు సార్‌

త‌ప్పు క‌దా..?