కర్ణాటక రాజకీయంలో సెక్స్ స్కాండల్స్ కొత్త కాదు. అసెంబ్లీలో సమావేశాలు జరుగుతుండగానే బ్లూ ఫిల్మ్ లు చూసిన రాజకీయ నేతలున్న రాష్ట్రమది. అలా బ్లూ ఫిల్మ్ లు చూసిన బీజేపీ నేతలు ఇటీవలే మళ్లీ మంత్రులయ్యారు! బ్లూ ఫిల్మ్ లు చూసిన బీజేపీ నేతలను అప్పటి కర్ణాటక సీఎం రాజీనామా చేస్తారా లేదా? అంటూ గొంతు మీద కత్తి పెట్టగా, ఇటీవల కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని బీజేపీ వాళ్లు కూల్చినప్పుడు.. సదరు బ్లూ నేతలకు మళ్లీ మంత్రులు ఇవ్వక తప్పలేదు!
రాజకీయంగా తమ అవసరం ఉంటే చాలు.. ఏం చేసినా చెల్లిపోతుందని కర్ణాటక బీజేపీ నేతలకు బాగా అర్థం అయినట్టుగా ఉంది. ఆల్రెడీ తమ పార్టీ నేతలు ఈ రచ్చల్లో నిలిచినప్పటికీ మరో బీజేపీ నేత ఏకంగా ఇంకో పెద్ద సెక్స్ స్కాండల్ లో ఇరుక్కున్నాడు.
ప్రస్తుత యడియూరప్ప ప్రభుత్వం కీలక నేతగా పేరున్న రమేష్ జర్కిహోళి ఒక యువతితో గడిపిన వీడియో దుమారం రేపుతూ ఉంది. ఏదో పని మీద ఆ మంత్రిగారిని ఆశ్రయించిన ఆ యువతి ఆయనకు బాగా దగ్గరైందట. వారిద్దరూ శయనించడమే కాదు.. దాన్ని వీడియోగా కూడా తీసుకుని తృప్తి పొందినట్టుగా ఉన్నారు. ఆ వీడియో ఇప్పుడు బయటకురావడంతో పెద్ద దుమారం రేగింది. కీలక నేతగా ఉంటున్న మంత్రిగారు ఇలా వార్తల్లో రావడంతో ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తూ ఉన్నాయి. టీవీ చానళ్లకు ఇంతకు మంత్రిగారి మసాలా దొరికింది, దీంతో అవి నూరుతూనే ఉన్నాయి.
ఉదయం లేస్తే.. భారతీయ విలువలు, వంకాయలు అంటూ.. కమలదళం మాట్లాడుతూ ఉంటుంది. ఆఖరికి వ్యాలెంటైన్స్ డే జరుపుకునే కుర్రకారును కూడా ఈ బ్యాచ్ సహించదు. మరి కాషాయ కండువాలు వేసుకుంటూ, నుదుటున పెద్ద పెద్ద బొట్లు పెడుతూ.. హిందుత్వం అంటూ మాట్లాడుతూ.. ఇలా చేయడాన్ని ఏమనాలో మరి! వాళ్లు బీజేపీ కాబట్టి.. ఇలాంటి వాటిల్లో కూడా వాళ్లను సమర్థించకపోతే ఈ దేశంలో ఉండే అర్హత లేదు కాబోలు.. ఇలాంటి వాటిని ప్రస్తావించినా పాకిస్తాన్ వెళ్లిపొమ్మంటారేమో!