Advertisement

Advertisement


Home > Movies - Movie News

పవన్ సినిమాల కంట్రోలు త్రివిక్రమ్ చేతిలో

పవన్ సినిమాల కంట్రోలు త్రివిక్రమ్ చేతిలో

పేరుకు పవన్ కళ్యాణ్ సినిమాలే కానీ, వాటి వెనుక కర్త..కర్మ..క్రియ అన్నీ తివిక్రమ్ నే అని ఇండస్ట్రీ వర్గాలు అన్నింటికీ తెలుసు. పవన్ పవన్ రీ ఎంట్రీ, వకీల్ సాబ్ సెలెక్షన్ వీటన్నింటికి వెనుక వున్నది త్రివిక్రమ్ నే. ఆ తరువాత భీమ్లా నాయక్ సినిమా కు అన్నీ ఆయనై వ్యవహరించారు. ఆయనతో సంబంధం లేని హరి హర వీరమల్లు సినిమా అలా పక్కన పడి వుంది. భవదీయుడు భగత్ సింగ్ సినిమా సంగతి ఏమీ తెలియదు.

కానీ ఈ లోగా త్రివిక్రమ్ డీల్ చేసి, స్క్రిప్ట్ అందిస్తున్న వినోతహితం రీమేక్ మాత్రం పట్టాలు ఎక్కేస్తోంది. అలాగే త్రివిక్రమ్ కథ, మాటలు అందిస్తున్న మరో సినిమా కూడా డీల్ అయి రెడీగా వుంది. దానికి వైష్ణవ్ తేజ్ హీరో. ఇలా పవన్ విషయంలో అన్నీ తన కంట్రోల్ లో వుంచుకున్న త్రివిక్రమ్ లేటెస్ట్ గా తన టీమ్ ద్వారా కొన్ని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

వినోదహితం రీమేక్ విషయంలో యూనిట్ కానీ, ఆ సినిమాతో ఏ విధంగా సంబంధం కలిగిన మరెవ్వరూ కానీ ఎక్కడా నోరు మెదపడానికి వీలు లేదని తన వ్యక్తిగత సిబ్బందితో మౌఖిక ఆదేశాలు జారీ చేయించినట్లు తెలుస్తోంది. 

ఎవ్వరు ఆ సినిమా గురించి అడిగినా అస్సలు నోరు మెదపవద్దని త్రివిక్రమ్ వైపు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. 

ఈ రోజు సినిమా పూజ జరిగింది లాంఛనంగా. ఈ వివరాలు కూడా బయటకు రాకుండా, ఓ ఫొటో కూడా బయటకు వదలకుండా చూసారు. పూజకు హీరోలు ఇద్దరూ రాలేదు. మళ్లీ రెండు నెలల వరకు ముహుర్తాలు లేవని లాంఛనంగా జరిపించారు. 

మొత్తం మీద పవన్ సినిమాల మీద త్రివిక్రమ్ పూర్తి కంట్రోలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే క్వాలిటీ కంట్రోలు, మీటింగ్ లు, డిస్కషన్లు, యాక్టర్ల సెలక్షన్లు అన్నీ ఆయన కనుసన్నలలోనే జరుగుతున్నాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?