Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఓ పాట కోసం ఎన్ని పాట్లో?

ఓ పాట కోసం ఎన్ని పాట్లో?

సినిమా ఇలా చూసేసి అలా మరిచిపోతాం..లేదా ఇష్టం అయితే మరోసారి చూస్తాం. ఇంకో సారి చూస్తాం. కానీ సినిమా వెనుక ఎన్ని బాధలు వుంటాయో..మేకింగ్ ఎంత కష్టమో అన్నది తెలుసుకుంటే భలే చిత్రంగా వుంటుంది. పీపుల్స్ మీడియా సంస్థ ఇటీవల ఓ పాట కోసం నానా పాట్లు పడింది.

రవితేజ హీరోగా నిర్మిస్తున్న ఢమాకా సినిమా కోసం ఓ పాట చిత్రీకరించారు. ఆ పాట కోసం వంద మంది ఫారిన్ డ్యాన్సర్లు కావాల్సి వచ్చింది. ఫారిన్ డ్యాన్సర్లు వంద మంది ఇండియాలో ఒకే చోట ఎక్కడ దొరుకుతారు. అందుకే వేరు వేరు ఊళ్ల నుంచి సమీకరించారు. 

ఢిల్లీ, ముంబాయి, బెంగళూరు ఇలా...ఒక్కొక్కరికి పది నుంచి పదిహేను వేలు ఫ్లయిట్ టికెట్ వేసి హైదరాబాద్ రప్పించారు. ఇక్కడ స్టార్ హోటళ్లలో అకామిడేషన్ ఇచ్చారు. మన ఫుడ్ తినరు కనుక వెస్ట్రన్ ఫుడ్ కోసం వేరే ఏర్పాట్లు చేసారు. 

అంతా అయిన తరువాత సమ్మె సైరన్ వినిపించింది. దాంతో మళ్లీ పది నుంచి పదిహేను వేలు వంతున టికెట్ లు వేసి వెనక్కు పంపారు. రోజుకు వాళ్లకు ఇచ్చేది 7500 మాత్రమే. కానీ ఈ అదనపు ఖర్చులు అన్నీ తడిసి మోపెడు. 

ఇంతలో స్ట్రయిక్ క్యాన్సిల్ అయింది. మళ్లీ అంత ఖర్చూ చేసి వెనక్కు రప్పించారు. పాట చిత్రీకరించి వెనక్కు పంపారు. ఓ పాట వెనుక ఇన్ని పాట్లు వుంటాయి మరి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?