పవన్ సినిమా పట్టాలెక్కుతోంది

హరిహర వీరమల్లు సగం పూర్తయింది. ఉస్తాద్ భగత్ సింగ్ పూజ జరిగింది. వినోదయసితం సినిమా రీమేక్ షూట్ రేపు ప్రారంభం కాబోతోంది. సుజిత్ డైరక్షన్ లో సినిమా వెయిటింగ్ లో వుంది. ఇదీ పవర్…

హరిహర వీరమల్లు సగం పూర్తయింది. ఉస్తాద్ భగత్ సింగ్ పూజ జరిగింది. వినోదయసితం సినిమా రీమేక్ షూట్ రేపు ప్రారంభం కాబోతోంది. సుజిత్ డైరక్షన్ లో సినిమా వెయిటింగ్ లో వుంది. ఇదీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల అప్ డేట్ పొజిషన్. 

దర్శకుడు త్రివిక్రమ్ తన టాలెంట్ అంతా ఉపయోగించి వినోదయ సితం రీమేక్ స్క్రిప్ట్ ను రెడీ చేసారు. బుర్రా సాయిమాధవ్ మాటలు కొంత వరకు అందించారు కానీ ఫైనల్ వెర్షన్ త్రివిక్రమ్ నే రెడీ చేసారు. బుర్రా సాయి మాధవ్ కు సినిమా ప్రారంభం కాకుండానే సెటిల్ చేసేసారని తెలుస్తోంది.

ఇప్పుడు ఈ వినోదయ సితం సినిమా రీమేక్ షూట్ బుధవారం నుంచి ప్రారంభం కాబోతోంది. సిటీ పరిధిలోని ఓ ఇంటిలో షూటింగ్ వుంటుంది. పవన్ కళ్యాణ్ తో పాటు హీరో సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ, తనికెళ్ల భరణి తదితరులు షూటింగ్ లో పాల్గొంటారు. ఈ షెడ్యూలు కంటిన్యూగా ఎన్ని రోజలు అన్నది ఇంకా తెలియదు. అయితే అన్ని రోజులూ ఇద్దరు హీరోల కాంబినేషన్ సీన్లు వుంటాయని తెలుస్తోంది.

పవన్ లేని సీన్లు ఏవైనా వుంటే అవి తరువాత తీసుకుంటారు. జస్ట్ ఇరవై రోజులు వర్క్ చేస్తే చాలు పవన్ ఈ సినిమాకు. మిగిలిన వర్కింగ్ డేస్ మిగతా కాస్టింగ్ తో ఫినిష్ అయిపోతుందని తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తుంటే హరిహర వీరమల్లు సినిమా కన్నా ముందుగా ఈ సినిమానే వచ్చేలా వుంది.