పవన్ అభిమానులు పండగ చేసుకునే వార్త….పవన్‌కల్యాణ్ సినిమాలో ఆయన మాజీ భార్య, హీరోయిన్ రేణుదేశాయ్ నటించనున్నట్టు టాలీవుడ్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పవన్‌కల్యాణ్ -రేణుదేశాయ్ జంటగా బద్రి సక్సెస్ సాధించింది. అలాగే వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన మరో చిత్రం జానీ కూడా ప్రేక్షకుల ఆదరణ పొందింది. పవన్‌తో పెళ్లికి ముందే ఆమెకు చిత్ర పరిశ్రమతో పరిచయం ఉంది. ఆమె అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసేవారు. పూరి జగన్నాథ్ ఇంట్రెస్ట్‌తో ఆమె బద్రి సినిమాలో పవన్ సరసన నటించి మెప్పించారు.
రెండు సినిమాల్లో జంటగా నటించిన పవన్ – రేణుదేశాయ్ మధ్య ప్రేమ చిగురించి పెళ్లికి దారి తీసింది. వారికి బాబు ఆకీరా, పాప ఆద్య ఉన్నారు. ఆ తర్వాత పవన్‌తో విడిపోయారు. ప్రస్తుతం ఆమె పూణెలో పిల్లలతో పాటు ఉంటున్నారు. ఆమెకు దర్శకత్వంపై ఆసక్తి ఎక్కువ. ప్రస్తుత విషయానికి వస్తే మంచి పాత్రలు వస్తే నటిస్తానని ఇటీవల ఓ సినిమా ఫంక్షన్లో రేణుదేశాయ్ చెప్పారు. ఈ నేపథ్యంలో పవన్ ముచ్చటగా మూడు సినిమాలు ఒప్పుకున్నారు.
వీటిలో ఒక సినిమాలో రేణుదేశాయ్‌కి కూడా అవకాశం ఇస్తున్నట్టు టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో రేణు పాత్ర చాలా కీలకమైందని కూడా చెబుతున్నారు. పవన్‌తో నటించే విషయమై రేణు లేదా పవనో స్పష్టత ఇస్తే తప్ప వాస్తవాలేంటో తెలిసే అవకాశం లేదు. కానీ నిప్పు లేనిదే పొగ రాదు కదా?