కరోనా వస్తే నా దేవుడు పవన్ ఫోన్ చేయలేదు

బండ్ల గణేష్ కు కరోనా సోకిందనే విషయం తెలిసిన వెంటనే టాలీవుడ్ ఉలిక్కిపడింది. తెలిసిన వాళ్లు, తెలియని వాళ్లు అనే తేడా లేకుండా అంతా ఆయనకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి వాకబు చేసి…

బండ్ల గణేష్ కు కరోనా సోకిందనే విషయం తెలిసిన వెంటనే టాలీవుడ్ ఉలిక్కిపడింది. తెలిసిన వాళ్లు, తెలియని వాళ్లు అనే తేడా లేకుండా అంతా ఆయనకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి వాకబు చేసి పరామర్శించారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో తన దేవుడు పవన్ మిస్సయ్యాడని చెబుతున్నారు బండ్ల గణేష్. తనకు కరోనా వస్తే పవన్ ఫోన్ చేయలేదని బాధపడ్డాడు.

“నాకు కరోనా వచ్చిందని తెలిసిన వెంటనే ఫస్ట్ డైరక్టర్ మారుతి ఫోన్ చేశాడు. తర్వాత వరుసగా అందరూ కాల్ చేశారు. చిరంజీవి గారు ఫోన్ చేసి 10 నిమిషాలు మాట్లాడారు. నా దేవుడు పవన్ మాత్రం ఫోన్ చేయలేదు. బహుశా ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు. తెలిసి చేయలేదని అనుకోవడం కంటే, నాకు కరోనా వచ్చిందని తెలియక పవన్ ఫోన్ చేయలేదని అనుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది.”

కరోనా వచ్చిన తర్వాత రాత్రికి రాత్రి చనిపోతే ఏంటి పరిస్థితి అనే ఆలోచనతో చాలా భయం వేసిందంటున్నారు బండ్ల. తన జీవితాన్ని కరోనా మార్చేసిందని అన్నారు. ఇకపై మిగతా జీవితాన్ని ఆనందంగా గడుపుతానంటున్నారు.

“కరోనా చాలా నేర్పించింది. నాకు కరోనా రాకముందు ఏదో చేసేద్దాం, చించేద్దాం అనుకున్నాను. కరోనా వచ్చిన తర్వాత తత్వం తెలిసింది. మంచి స్టేటస్ అనుభవిస్తున్నానని గ్రహించాను. భగవంతుడు అన్నీ ఇచ్చాడు. ఈ చిన్న జీవితం కోసం వివాదాలు, గొడవలు వద్దనిపించింది. మన బతుకు మనం బతకాలి. హ్యాపీగా ఉండాలి. తల్లిదండ్రులు, పిల్లల్ని చూసుకుంటే చాలు అనిపిస్తోంది.”

ఇకపై పూర్తిస్థాయిలో సినిమా నిర్మాణంలో ఉంటానని ప్రకటించారు బండ్ల. తన బ్యానర్ పై కొత్త దర్శకుల్ని పరిచయం చేస్తానని చెప్పిన ఈ నిర్మాత.. 8-9 కథలు విన్నానని, అందులోంచి ఒకటి ఫైనల్ చేశానని ప్రకటించాడు. కరోనా హడావుడి తగ్గిన వెంటనే తన బ్యానర్ లో సినిమా మొదలుపెడతానంటున్నాడు బండ్ల గణేశ్.