Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆ ఒక్కటి తీసెయ్ వకీలూ.. ఫ్యాన్స్ వేడుకోలు

ఆ ఒక్కటి తీసెయ్ వకీలూ.. ఫ్యాన్స్ వేడుకోలు

నిన్న మధ్యాహ్నం నుంచి పవన్ ఫ్యాన్స్ ఓ కొత్త డిమాండ్ అందుకున్నారు. చాలా సినిమాలకు రిలీజ్ తర్వాత సన్నివేశాలు తొలిగించినట్టుగానే, వకీల్ సాబ్ సినిమాకు కూడా అలాంటి ''కటింగ్'' కార్యక్రమం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అదే పవన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.

సినిమా మొత్తం మీద పవన్ ఫ్యాన్స్ తో పాటు ఎక్కువ మంది ఆడియన్స్ కు నచ్చని ఎలిమెంట్ ఏదైనా ఉందంటే అది వకీల్ సాబ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రమే. మరీ ముఖ్యంగా శృతిహాసన్ తో వచ్చిన సన్నివేశాలు అస్సలు ఎక్కలేదు. పంటి కింద రాయిలా ఉన్న శృతిహాసన్ ఎపిసోడ్ ను తీసేయమని కోరుతున్నారు ఫ్యాన్స్.

నిజానికి ఈ ఎపిసోడ్ లోనే సూపర్ హిట్ కంటి పాప సాంగ్ కూడా ఉంది. అయినప్పటికీ ఆ సాంగ్ ను యూట్యూబ్ లో పెట్టేసి, సినిమా నుంచి టోటల్ శృతిహాసన్ ఎపిసోడ్ ను తీసేయాలని అభిమానులు దిల్ రాజును కోరుతున్నారు.

వీళ్ల డిమాండ్ కు మరో రీజన్ కూడా ఉంది. సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో పవన్ లో వయసుమళ్లిన ఛాయలు బాగా కనిపించాయి. దానికి ఎవరేం చేయలేరు కూడా. కానీ పవన్ ను మించి అన్నట్టుంది శృతిహాసన్ గెటప్. ఆమె మేకప్, డ్రెస్సింగ్ ఏదీ సెట్ అవ్వలేదంటూ కామెంట్స్ పడుతున్నాయి. అందుకే మొత్తంగా శృతిహాసన్ ఎపిసోడ్ ను తీసేయమని కోరుతున్నారు.

కానీ సినిమాలో కీలకమైన ట్విస్ట్ కు, శృతిహాసన్ ఎపిసోడ్ కు లింక్ పెట్టాడు దర్శకుడు. కాబట్టి ఉన్నఫలంగా దాన్ని తీసేయడం కుదరదు. ఈ విషయం తెలిసి కూడా ఫ్యాన్స్ తమ డిమాండ్లు ఆపడం లేదు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?