ఆలీపై ప‌వ‌న్ ఫ్యాన్స్ ట్రోల్‌…ఇంత కుసంస్కార‌మా?

ప్ర‌ముఖ క‌మెడియ‌న్ ఆలీపై టాలీవుడ్ అగ్ర‌హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫ్యాన్స్ బాగా ట్రోల్ చేస్తున్నారు. నిజానికి ఆలీని అభినందిం చాల్సింది పోయి…తిడుతుండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. దీంతో ఆలీని ట్రోల్ చేసే వారెంత కుసంస్కారులో అర్థం చేసుకోవాల‌ని…

ప్ర‌ముఖ క‌మెడియ‌న్ ఆలీపై టాలీవుడ్ అగ్ర‌హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫ్యాన్స్ బాగా ట్రోల్ చేస్తున్నారు. నిజానికి ఆలీని అభినందిం చాల్సింది పోయి…తిడుతుండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. దీంతో ఆలీని ట్రోల్ చేసే వారెంత కుసంస్కారులో అర్థం చేసుకోవాల‌ని ఆలీ అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ఆలీ మంచి స్నేహితుల‌ని అంద‌రికీ తెలుసు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఏర్ప‌డిన వివాదం వాళ్లిద్ద‌రి మ‌ధ్య మ‌రింత దూరాన్ని పెంచింద‌ని చెప్పొచ్చు. తాజా ఘ‌ట‌న‌తో ఆలీపై ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎంత క‌సిగా ఉన్నారో మ‌రోసారి రుజువు చేసింది. అస‌లేం జ‌రిగిందంటే…

సెప్టెంబ‌ర్ 2 ప‌వ‌న్‌క‌ల్యాణ్ పుట్టిన రోజు. అయితే ప‌వ‌న్ అభిమానులు ఎంతో ముందుగానే త‌మ అభిమాన హీరోకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెబుతూ ఈ నెల 13న సోష‌ల్ మీడియాలో బ‌ర్త్‌డే పవ‌న్ క‌ల్యాణ్ హ్యాష్ ట్యాగ్‌తో హ‌ల్‌చ‌ల్ చేశారు. త‌న స్నేహితుడికి సంబంధించిన వేడుక కావ‌డంతో క‌మెడియ‌న్ ఆలీ కూడా సోష‌ల్ మీడియాలో ఆ ట్రెండ్‌లో పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు.

‘వ్యక్తిత్వంలో నిన్ను ఓడించలేనప్పుడు నీ కులం గుణం వర్ణం గురించి మాట్లాడుతారు. ఎవరెన్ని విధాలుగా విమర్శించినా చెదరని నీ నవ్వుకి నీ సహనానికి శిరస్సు వంచి నమస్కారాలు పవన్ కల్యాణ్ ’ అంటూ  ఓ రెడ్ హార్ట్ సిగ్నల్‌ను అలీ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. త‌మ హీరో వ్య‌క్తిత్వాన్ని గొప్ప‌గా ఆవిష్క‌రించ‌డం కూడా ప‌వ‌న్ అభిమానుల‌కి న‌చ్చ‌లేదు. ఆలీకి బ‌ర్త్ డే విషెస్‌కి రాజ‌కీయాల‌కు ముడిపెట్టి చూశారు.

రాజ‌కీయంగా ఆలీ వైసీపీ వెంట న‌డుస్తున్నాడు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం కోసం ఆలీ విస్తృతంగా ప్ర‌చారం చేశాడు. ఈ సంద‌ర్భంగా ఆలీపై ప‌వ‌న్ బ‌హిరంగంగా కామెంట్స్ చేశాడు. వాటికి ఆలీ త‌న‌దైన స్టైల్‌లో కౌంట‌ర్ ఇచ్చాడు. అప్ప‌టి నుంచి ఆలీపై ప‌వ‌న్ అభిమానులు క‌క్ష క‌ట్టిన‌ట్టు ట్రోల్ చేస్తున్నారు.

స్నేహితుడిపై అప్పుడ‌లా కామెంట్స్ చేశావే అని నిలదీస్తూ ఆలీపై ట్రోల్ చేయ‌డం ప్రారంభించారు. నువ్వు చేసిన మోసాన్ని ఎలా మ‌రిచిపోతామంటూ ప‌వ‌న్ అభిమానులు ప్ర‌శ్నిస్తూ కామెంట్స్ చేయడం గ‌మ‌నార్హం. ప‌వ‌న్ అభిమానుల ట్రోలింగ్‌పై ఆలీ అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. రాజ‌కీయాలు వేరు, వ్య‌క్తిగ‌త సంబంధాలు వేర‌ని విష‌యాన్ని కూడా గుర్తించ‌లేని అంధ అభిమానులు కొంద‌రున్నారంటున్నారు.

నా మాదిరి ఏ నిర్మాతా సంపాదించలేదు