రమేష్ వర్మ దర్శకత్వంలో పవన్ కల్యాణ్?

వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు పవన్ కల్యాణ్. తాజాగా మరో రీమేక్ ప్రాజెక్టును ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉందంటూ కథనాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు వీటికి కొనసాగింపుగా మరో ప్రచారం మొదలైంది. రమేష్ వర్మ దర్శకత్వంలో…

వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు పవన్ కల్యాణ్. తాజాగా మరో రీమేక్ ప్రాజెక్టును ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉందంటూ కథనాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు వీటికి కొనసాగింపుగా మరో ప్రచారం మొదలైంది. రమేష్ వర్మ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ ఓ సినిమా చేస్తారట. దీనికి సంబంధించి చర్చలు సాగుతున్నాయనేది ఆ కథనం సారాంశం. ఈ గాసిప్ బయటకు రావడానికి ఓ కారణం కూడా ఉంది.

ఖిలాడీ ప్రమోషన్ లో భాగంగా నిర్మాత కోనేరు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ తో సినిమా చేసే ఆలోచనను బయటపెట్టారు. తాజాగా పవన్ కల్యాణ్ ను ఈ నిర్మాత కలిశారట. సినిమా చేయాలని ఆసక్తిని వ్యక్తపరిచారట. దానికి పవన్ సముఖంగా స్పందించారట. ఓ మంచి స్టోరీ దొరికితే పవన్ కల్యాణ్ ను కలిసి కథ వినిపిస్తానని చెప్పారు.

కోనేరు సత్యనారాయణ బ్యానర్ అనగానే ఎవరైనా రమేశ్ వర్మ గుర్తొస్తారు. ఖిలాడీ సినిమా డైరక్టర్ ఇతడే. రీసెంట్ గా ఈ డైరక్టర్ కు కాస్ట్ లీ కారు కూడా గిఫ్ట్ గా ఇచ్చారు కోనేరు. కాబట్టి రమేష్ వర్మ ద్వారానే పవన్ కల్యాణ్ కు కథ వినిపించే అవకాశం ఉందంటూ కథనాలు వస్తున్నాయి.

ప్రస్తుతం పవన్ చేతిలో చాలా సినిమాలున్నాయి. భీమ్లానాయక్ ను రిలీజ్ కు రెడీ చేసిన పవన్.. హరిహర వీరమల్లు సినిమాను సెట్స్ పై ఉంచాడు. హరీశ్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలకు ఓకే చెప్పారు. వీటితో పాటు తమిళ్ లో వచ్చిన వినోదాయ శితం అనే రీమేక్ పై కూడా చర్చలు జరుపుతున్నారు. ఇలాంటి టైమ్ లో ఆయన కోనేరు సత్యనారాయణ సినిమాకు ఓకే చెబుతారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.