విడాకులపై స్పందించిన హీరో

హీరో సుమంత్ ఆల్రెడీ విడాకులు తీసుకున్నాడు. కీర్తి రెడ్డి నుంచి విడిపోయి చాన్నాళ్లయింది. ప్రస్తుతం సింగిల్ గానే ఉంటున్నాడు. ఇలాంటి హీరో విడాకులపై స్పందిస్తున్నాడు. ప్రస్తుతం సమాజంలో విడాకులు కామన్ అయిపోయాయంటున్నాడు ఈ హీరో.…

హీరో సుమంత్ ఆల్రెడీ విడాకులు తీసుకున్నాడు. కీర్తి రెడ్డి నుంచి విడిపోయి చాన్నాళ్లయింది. ప్రస్తుతం సింగిల్ గానే ఉంటున్నాడు. ఇలాంటి హీరో విడాకులపై స్పందిస్తున్నాడు. ప్రస్తుతం సమాజంలో విడాకులు కామన్ అయిపోయాయంటున్నాడు ఈ హీరో.

“నాకు తెలిసిన చాలామంది విడాకులు తీసుకున్నారు. నా కుటుంబంలో కూడా విడాకులున్నాయి. దురదృష్టవశాత్తూ డైవోర్స్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. ఈ విషయంలో నేను దురదృష్టం అనే పదం కూడా వాడదలుచుకోలేదు. అలా జరుగుతున్నాయంతే. కానీ రెండో పెళ్లి విషయానికొచ్చేసరికి కొన్ని కష్టాలున్నప్పటికీ అడ్జెస్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే, రెండో పెళ్లి కూడా ఫెయిల్ అయితే ముద్ర పడిపోతుంది. అందుకే రెండో పెళ్లిని ఎలాగోలా కొనసాగించాలనే అనుకుంటారు ఎవరైనా.”

మళ్లీ మొదలైంది అనే సినిమా చేశాడు సుమంత్. విడాకుల కాన్సెప్ట్ తో తెరకెక్కింది ఇది. అందుకే ఇంటర్వ్యూలో సుమంత్ కి విడాకులపై స్పందించక తప్పలేదు. పైగా అక్కినేని కుటుంబంలో ఈమధ్య నాగచైతన్య-సమంత విడిపోయారు. దీంతో సహజంగానే సుమంత్ ప్రకటనపై అందరిలో ఆసక్తి పెరిగింది.

జీవిత భాగస్వామితో ఇబ్బంది పడే బదులు, సెకెండ్ ఛాన్స్ తీసుకోవడమే బెటర్ అంటున్నాడు సుమంత్. 'మళ్లీ మొదలైంది' సినిమాలో కూడా ఇదే విషయాన్ని డిస్కస్ చేశామని చెబుతున్నాడు.