మీడియా ముందుకు పవన్ కళ్యాణ్

ఆయన హీరో పవన్ కళ్యాణ్ గా మీడియా ముందుకు రావడం చాలా అరుదు. కానీ ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా ఇప్పటికే పలుసార్లు మీడియా ముందుకు వచ్చారు

ఆయన హీరో పవన్ కళ్యాణ్ గా మీడియా ముందుకు రావడం చాలా అరుదు. కానీ ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా ఇప్పటికే పలుసార్లు మీడియా ముందుకు వచ్చారు. కానీ ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన తరువాత సినిమా మీడియా ముందుకు రాలేదు. తెలుగు సినిమా మీడియా ముందుకు పవన్ రావడం ఇదే ప్రధమం. ఇది సడెన్ డెవలప్‌మెంట్.

రాత్రి పొద్దు పోయే వరకు ఈ విషయం తెలియలేదు. వున్నట్లుండి హరి హర వీరమల్లు పీఆర్ టీమ్ ఈ సమాచారం మీడియాకు అందించింది.

హరి హర వీరమల్లు సినిమాకు ఇప్పటి వరకు పవన్ వైపు నుంచి ప్రమోషన్ లేదు. రేపు సాయంత్రం ప్రీరిలీజ్ మీట్ వుంది. ఉదయం మీడియా మీట్ కు టోటల్ క్రూ హాజరవుతుంది. అందువల్ల కాస్త ఉపన్యాసాలు వుండే అవకాశం వుంది.

ఆ తరువాత పవన్ కేవలం ప్రసంగించి ఊరుకుంటారో లేదా మీడియా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారో చూడాలి.

4 Replies to “మీడియా ముందుకు పవన్ కళ్యాణ్”

Comments are closed.